ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ..తాను ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో తనకి జరిగిన ఏ చిన్న అవమానాన్ని కూడా మర్చిపోలేదు. తనకు ఎదురైన అవమానాలను వడ్డీతో సహా చంద్రబాబుకు తిరిగిచ్చేస్తున్నారు. సేమ్ తనను అధికారంలో ఉన్నప్పుడు ఎలాగైతే అవమానించాడో అలాగే బాబుకు పట్ట పగలే చుక్కలు చూపిస్తున్నాడు.
తాజాగా చంద్రబాబు చిత్తూరు జిల్లా పర్యటన ఫిక్స్ చేసుకున్నాడు. ఏకంగా 5వేల మంది టీడీపీ కార్యకర్తలతో ధర్నాకు నిర్ణయించారు. అసలే కరోనా సమయం సెకండ్ వేవ్ మొదలైందని పైగా తిరుపతి ఎంపీ ఎన్నికలకు నోటిఫికేషన్ ను ఈసీ జారీ చేయడంతో పోలీసులు ఈ ధర్నాకు అనుమతి నిరాకరించారు. కీలక టీడీపీ నేతలందరినీ అరెస్ట్ చేసి పీఎస్ లకు తరలించారు.
టీడీపీ నేతలు చంద్రబాబుకు స్వాగతం పలకడానికి రేణిగుంట విమానాశ్రయానికి రాగా వారిని వెళ్లకుండా పోలీసులు అరెస్ట్ చేయడం ఉద్రిక్తతలకు దారితీసింది. చంద్రబాబు ఈ ఉదయం రేణిగుంట విమాశ్రయానికి రాగానే పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. కరోనా విస్తరణ నేపథ్యంలో అనుమతి నిరాకరించారు. నిరసనకు అనుమతి లేదని పోలీసులు చెప్పారు. దీంతో విమానాశ్రయంలోనే నేలపై బైఠాయించి నిరసన తెలుపుతున్నారు.
దీంతో రేణిగుంట విమానాశ్రయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కరోనా నిబంధనల కారణంగా నిరసనకు అనుమతి ఇవ్వట్లేదని పోలీసులు అంటున్నారు. టీడీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో విమానాశ్రయానికి వస్తున్నారు. చెప్పింది వినకుండా నిబంధనలు అతిక్రమిస్తే అదుపులోకి తీసుకుం టామని ఇప్పటికే చంద్రబాబుకు రేణిగుంట పోలీసులు నోటీసులు జారీ చేశారు. నాడు వైజాగ్ లోనూ నిరసన తెలుపడానికి వచ్చిన జగన్ కు ఇదే గతి పట్టిందని.. సేమ్ సీన్ తిరుపతి లో రిపీట్ అయ్యిందని వైసీపీ నేతలు చర్చించుకుంటున్నారు.