పవన్, ఎన్టీఆర్.. చంద్రబాబు రాజకీయాలకు బలయ్యే స్టార్స్ ఎందరో?

రాజకీయాలలో చాణక్యుడిగా చంద్రబాబు నాయుడు పేరును సంపాదించుకున్నారు. అయితే చాణక్యుడి స్థాయిలో తెలివితేటలు ఉన్నా చంద్రబాబు నాయుడు ఆ తెలివితేటలను మంచి కంటే చెడుగానే ఎక్కువగా వినియోగాస్తారని పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తుంది. చంద్రబాబును నమ్ముకుని బాగుపడిన టీడీపీ నేతలతో పోల్చి చూస్తే నష్టపోయిన టీడీపీ నేతల సంఖ్యనే ఎక్కువగా ఉండటం గమనార్హం.

సినిమా రంగానికి సెలబ్రిటీలను వాడుకోవడంలో చంద్రబాబుకు మరెవరూ సాటిరారని చెప్పవచ్చు. 2009 ఎన్నికల సమయంలో టీడీపీ అధికారంలోకి రావడం కోసం చంద్రబాబు నాయుడు జూనియర్ ఎన్టీఆర్ ను అస్త్రంగా వాడుకున్నారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేసిన చాలా ప్రాంతాలలో తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది. వైఎస్సార్ ప్రజల హృదయాల్లో చోటు సంపాదించుకోవడం కూడా టీడీపీ ఓటమికి కారణమైంది.

అయితే టీడీపీని జూనియర్ ఎన్టీఆర్ గెలిపించలేకపోయినా 2014లో పవన్ చేసిన సాయం టీడీపీకి కలిసొచ్చింది. ఆంధ్రప్రదేశ్ కు అనుభవం ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రి అయితే బాగుంటుందనే ఆలోచనతో టీడీపీని గెలిపించడానికి ప్రజలు ఆసక్తి చూపారు. అయితే 2014లో టీడీపీ అధికారంలోకి రావడం వల్ల ప్రజలకు కలిగిన లాభం కంటే నష్టమే ఎక్కువనే సంగతి తెలిసిందే. చంద్రబాబు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలలో మెజారిటీ హామీలను నెరవేర్చలేదు.

చంద్రబాబుపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉండటంతో ఎన్నికల ఫలితాలు వైసీపీకి అనుకూలంగా వచ్చాయి. 2024 ఎన్నికల్లో కూడా వైసీపీకి అనుకూల ఫలితాలు వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగానే ఉన్నాయని చాలామంది భావిస్తున్నారు. పవన్, ఎన్టీఆర్ లను అవసరానికి వాడుకుని వదిలేసిన చంద్రబాబు రాబోయే ఎన్నికల్లో ఏ స్టార్ కు గాలమేశారో అంటూ నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.