టీడీపీ అధికారంలోకి చంద్రబాబు చేయాల్సిందిదే.. ఆ తప్పులు వద్దు అంటూ?

2024 ఎన్నికల్లో టీడీపీ కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి నెలకొందనే తెలిసిందే. ఎన్నికల్లో ఓటమిపాలు అయితే ఆ ప్రభావం ఊహించని స్థాయిలో పడే అవకాశం ఉంటుంది. టీడీపీ 2024 ఎన్నికల్లో గెలవని పక్షంలో ఆ పార్టీ చరిత్ర ముగిసినట్లేనని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే టీడీపీ అధికారంలోకి రావాలంటే చంద్రబాబు కొన్ని తప్పనిసరిగా చేయాల్సి ఉంది. అలా చేస్తే మాత్రమే 2024 ఎన్నికల్లో టీడీపీకి విజయావకాశాలు పెరిగే ఛాన్స్ అయితే ఉంటుంది.

ఏదో ఒక విధంగా చంద్రబాబు టీడీపీ జనసేన కలిసి పోటీ చేసే విధంగా అడుగులు వేయాల్సి ఉంది. టీడీపీ జనసేన కలిసి పోటీ చేయడం ద్వారా వైసీపీ వ్యతిరేక ఓట్లు టీడీపీ జనసేన కూటమికి పడే ఛాన్స్ ఉంది. గత ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలకు చంద్రబాబు నాయుడు కచ్చితంగా ఛాన్స్ ఇవ్వాల్సి ఉంది. అదే సమయంలో ఆర్థికంగా బలంగా ఉన్న నేతలకు, ప్రజలలో మంచి గుర్తింపు ఉన్న నేతలకు చంద్రబాబు ప్రాధాన్యత ఇవ్వాలి.

ఆర్థికంగా బలంగా లేని నేతలకు టీడీపీ అండగా నిలబడితే బాగుంటుందని మరి కొందరు కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చంద్రబాబు ఇదే సమయంలో స్ట్రాటజిస్ట్ లను సైతం నియమించుకోవాల్సి ఉంది. చంద్రబాబు ఈ విషయాలలో మారితే మాత్రమే టీడీపీకి భవిష్యత్తు ఉంటుందని చెప్పవచ్చు. చంద్రబాబు ఇప్పటినుంచి టీడీపీ గెలుపు కోసం కష్టపడాల్సి ఉంది.

పాదయాత్ర కాకపోయినా మరో విధంగా ప్రజలతో మమేకమై చంద్రబాబు ప్రజల్లో టీడీపీపై నమ్మకాన్ని కలిగించాల్సిన అవసరం అయితే ఉంది. ఇప్పటికీ టీడీపీని అభిమానించే వాళ్ల సంఖ్య బాగానే ఉంది. టీడీపీ విషయంలో చంద్రబాబు ఎలాంటి అడుగులు వేస్తారో చూడాలి. చంద్రబాబు కచ్చితంగా వచ్చే ఎన్నికల్లో గెలవాలని పార్టీని కూడా గెలిపించాలని టీడీపీ అభిమానులు కోరుకుంటున్నారు.