తలెక్కడా పెట్టుకుంటావ్ జగన్ రెడ్డీ.. తెరవెనుక ఉన్నది చంద్రబాబే కదా?

Chandrababu, Lokesh unhappy with EC

ఏపీలో రాజకీయ నేతలు ఇతర పార్టీల నేతలను విమర్శించడానికి తమకు ఉన్న ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు. తలెక్కడ పెట్టుకుంటావ్ జగన్ రెడ్డీ అంటూ చంద్రబాబు నాయుడు జగన్ పై చేసిన విమర్శలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాయి. అయితే జగన్ తల దించుకోవాల్సి వస్తే అంతకంటే ముందు చంద్రబాబు నాయుడు తల దించుకోవాల్సి ఉంది. చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలోనే వివేకానందరెడ్డి హత్య జరిగింది.

ఆ సమయంలో వివేకా హత్య కేసులో నిందితులను కనిపెట్టడంలో టీడీపీ ఫెయిలైంది. వివేకా కూతురును రెచ్చగొడుతూ తెరవెనుక చంద్రబాబు చేస్తున్న రాజకీయాలు ఎవరికీ తెలియనివి కావు. సునీత టీడీపీ తరపున ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతుండటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. ఇలాంటి సమయంలో చంద్రబాబు ఎన్ని విమర్శలు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితులు లేవు.

చంద్రబాబు ప్రజల నుంచి వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో ఏ దారి లేక చివరకు జగన్ పై విమర్శలు చేస్తున్నారని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. జగన్ పై విమర్శలు చేయడం కాదని చంద్రబాబు తలెక్కడ పెట్టుకుంటారని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు. జగన్ ను కావాలని టార్గెట్ చేస్తే ఊరుకోమని కొంతమంది చెబుతున్నారు. జగన్ టార్గెట్ చేస్తే ఏపీలో చంద్రబాబు పార్టీ ఈపాటికి ఉండేది కాదని మరి కొందరు చెబుతున్నారు.

జగన్ దయ వల్లే ఏపీలో టీడీపీ కొనసాగుతోందని చంద్రబాబు సొంతంగా పార్టీని పోటీ చేయిస్తే ఆ పార్టీ అసలు ఫలితాలు వెల్లడవుతాయని మరి కొందరు చెబుతున్నారు. చంద్రబాబు చేసిన సోషల్ మీడియా పోస్ట్ కు ప్రజల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన లేదనే సంగతి తెలిసిందే.