గత ఎన్నికల్లో వైఎస్ జగన్ అంత భారీ మెజారిటీతో గెలవడానికి కారణం చంరబాబు నాయుడు మీదున్న వ్యతిరేకతే. అదే వైసీపీకి 151 స్థానాల బలాన్ని అందించింది. కొత్త రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబుకు అవకాశం ఇస్తే ఆయన పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోలేకపోవడంతో జనం అసంతృప్తికి లోనయ్యారు. అందుకే ఒక్క అవకాశం ఇవ్వండి అంటూ అడిగిన జగన్ విజ్ఞప్తిని మన్నించి గెలిపించారు. జగన్ సీఎం పీఠం మీద కూర్చొని ఇప్పటికి ఏడాదిన్నర దాటిపోయింది. సంక్షేమం అమలులో అనుకున్నదానికంటే మంచిగానే పనిచేస్తున్నారు. ఇచ్చిన భారీ హామీలను నిదానంగా నెరవేర్చుకుంటూ వస్తున్నారు. ఇప్పటికే కొన్నిటిని అమలుచేయగా ఇంకా కొన్ని పథకాలను ఆచరణలోకి తీసుకురావడానికి సన్నాహకాలు చేస్తున్నారు.
ఈ క్రమంలో అప్పుడు కొండలా పేరుకుపోతున్న నిబ్బరంగా ముందుకు వెళ్తున్నారు. జగన్ చేస్తూనే అప్పుడు చంద్రబాబు హయాంలో చేసిన అప్పుల కంటే ఎక్కువగానే ఉన్నప్పటికీ కళ్ళ ముందు సంక్షేమం కనిపిస్తుండటంతో జనం నుండి ఆందోళన అంతగా లేదు. పథకాల మేలు వరకు మాత్రం చంద్రబాబు కంటే జగన్ బెటర్ అని ఫీడ్ బ్యాక్ ఇస్తున్నారు ఓటర్లు. కానీ అభివృద్ధి విషయంలోనే జగన్ పాలన్ మీద అసంతృప్తి రగులుతోంది. తాను అధికారంలో ఉన్నప్పుడే పనితనం మీద ఎప్పటికప్పుడు నివేదికలు తీసుకునే చంద్రబాబు జగన్ పాలన మీద కూడ అలాంటి నివేదికలు తీయిస్తున్నారట. ఈ నివేదికల్లో వెల్ఫేర్ స్కీమ్స్ విషయంలో తన కంటే జగన్ పెర్ఫార్మెన్స్ బాగుందని తేలిందట. ఇది ఆయన డీలాపడే విషయమే అయినా ఇంకొక అంశంలో మాత్రం జగన్ కంటే తనకే మంచి మార్కులు పడ్డాయని సంతోషిస్తున్నారట.
అదే పైన మాట్లాడుకున్న డెవలప్మెంట్. చంద్రబాబు హయాంలోనే కాస్తో కూస్తో అభివృద్ధి పనులు కనిపించాయని జనం మాట్లాడుకుంటున్నారట. చంద్రబాబు తాను చెప్పుకున్నంత స్థాయిలో కాకపోయినా అమరావతి నిర్మాణం, రాష్ట్ర ఖర్చులతో పోలవరాన్ని ముందుకు తీసుకెళ్లడం, కొత్త పెట్టుబడులు అంటూ అభివృద్ధిని చూశారు. కానీ జగన్ హయాంలో అవే నత్తనడకన సాగుతున్నాయి. అమరావతి అటకెక్కితే పోలవరం డైలమాలో పడింది. కేంద్రం నుండి నాబార్డు కింద ఎప్పుడో రావాల్సిన నిధులు ఇప్పుడొచ్చాయి. పైపెచ్చు అంచనా వ్యయం విషయంలో తీవ్ర సందిగ్దత నెలకొంది. ఇవన్నీ చూస్తున్న రైతులు చంద్రబాబు అయితే తెగించి మోదీని ఢీకొట్టారు. కానీ కొత్త సీఎం అన్నింటికీ మెత్తబడిపోతున్నారు.. ఇలా ఉంటే ప్రాజెక్ట్ పూర్తవుతుందా అంటూ నిరాశ చెందుతున్నారట. ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే మాత్రం జగన్ కు ఇబ్బందులు తప్పవు.