ఏపీ ప్రభుత్వం విశాఖ అభివృద్ధి కోసం కాకుండా విచ్చిన్నం చేయాలని చేస్తోంది అని చంద్రబాబు ఆరోపణలు చేశారు. ఉద్యమానికి పల్లా ఊపిరి ఇచ్చారు అని ఆయన అన్నారు. విశాఖకు స్టీల్ ప్లాంట్ గుండెకాయ..32 ప్రాణ త్యాగాలతో ఏర్పడింది అని ఆయన వెల్లడించారు. ఆనాడు స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి ఇందిరా తలోగ్గారు స్టీల్ ప్లాంట్ ఇచ్చారు అని చంద్రబాబు గుర్తు చేసారు. స్టీల్ ప్లాంట్ భూముల రెండు లక్షల కోట్లు ఉంటాయి అని ఆయన అన్నారు.
ఇలా అమ్ముకుంటే..పరిశ్రమలు విశాఖలో ఉండవు అని ఆయన అన్నారు. వాజ్ పాయి ప్రధాని గా ఉన్నపుడు..ప్రైవేటీకరణ చేయవద్దని కోరాను అని గుర్తు చేసారు. అమ్మకానికి పెడితే…రాష్ట్ర అధినేతలు ఎక్కడికి పోయారు అని ప్రశ్నించారు. విశాఖ ఆత్మ స్టీల్ ప్లాంట్ దీనిని దోచుకోవాలని కుంటున్నారు అని మండిపడ్డారు. 25 ఎంపీలు ఇస్తే…తాడేపల్లి లో ఏమి చేస్తున్నావు? పబ్జీ అడుతున్నావా?రాష్ట్ర హక్కులు కాలాడలేనివారు సీఎం? అని నిలదీశారు.
దొంగ దొంగే అన్నట్లు..ఉంది అని అన్నారు. ఎవరిని మోసం చేయాలనుకుంటున్నారు? నంగనాచి కబుర్లు ఆడుతున్నారు అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు. ప్రజలు తిరుగుబాటు చేస్తే…వైసిపి నేతలు బయటకు తిరగలేరు అని ఆయన వార్నింగ్ ఇచ్చారు. విశాఖ భవిష్యత్తు కోసం అమృతరావు ప్రాణ త్యాగం చేశారు అని ఆయన గుర్తు చేసారు. ప్రజావేధిక కూల్చినప్పటి నుంచి విధ్వంస పాలన మొదలు అయింది అని ఆయన అన్నారు. మంచికి మారు పేరు విశాఖ..విశాఖ నాకు ఇష్టం అని అన్నారు. ఏపీకి ఎప్పటికి విశాఖ ఆర్ధిక రాజధాని గా ఉంటుంది అని ఆయన స్పష్టం చేసారు. ఈ సీఎం నాలుగు ఏళ్లలో ఏమి పీకారు, అని ఆయన నిలదీశారు. ఏ2 పిచ్చి కుక్కలాగా తిరుగుతున్నాడు అని మండిపడ్డారు. నీ పాదయాత్ర ఎవరికి కావాలి, అని ప్రశ్నించారు. ఏ2 దొంగ నాటకం అడుతున్నాడు..దొంగ దారిలో ప్లాంట్ ను కొట్టేయాలను చూస్తున్నాడు అని మండిపడ్డారు. పల్లా 7 రోజులు ఆమరణ దీక్ష చేస్తే…మంత్రులు ఎందుకు ఎవరు రాలేదు అని ఆయన నిలదీశారు. ఇక్కడ దొంగ స్వామి ఒకడు ఉన్నాడు .. అక్కడకు వెళ్తారట అని ఎద్దేవా చేసారు.