ప్రిపేర్ అవ్వకుండా వచ్చేస్తోన్న పవన్… గట్టిగా కొట్టిన సెంట్రల్ హోం!

చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్ ని యదాతదంగా చదవడం మినహా పవన్ కు మరేమీ రావని.. ప్యాకేజీ మైకంలో కళ్లు మూసుకుపోయాయని వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆ విమర్శలకు బలం చేకూర్చేలా తాజాగా కేంద్రం హోం మంత్రిత్వ శాఖ నివేదికలు తెరపైకి వచ్చాయి.

ఏపీలో వాలంటీర్లు ఉమన్ ట్రాఫికింగ్ కి సహాయపడుతున్నారని, ఏపీలో ఆడపిల్లలు అధికంగా మిస్ అవుతున్నారని పవన్ ఆరోపించిన సంగతి తెలిసిందే. అయితే ఇందులో ఉన్న వాస్తవాలు, అవాస్తవాల వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఇందులో భాగంగా… శాంతిభద్రతల్లో మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్ర రాష్ట్రం చాలా మెరుగ్గా ఉందని తెలుస్తుంది.

అవును… కేంద్ర హోంశాఖ ఇచ్చిన నివేదిక ప్రకారం గడిచిన రెండేళ్లలో రాష్ట్రంలో ఐపీసీ 363, 369 (కిడ్నాప్, అపహరణ)సెక్షన్ల కింద నమోదైన మొత్తం కేసుల సంఖ్య 867గా ఉందని కేంద్రం ఇచ్చిన నివేదికలు చెబుతున్నాయని తెలుస్తుంది. ఇదే సమయంలో దేశవ్యాప్తంగా కిడ్నాప్ లేదా అపహరణకు గురవుతున్న వారు లక్షకు 7.4 శాతంగా ఉంటే ఆంధ్రాలో కేవలం 1.6% గా ఉందని తెలుస్తుంది.

ఇదే క్రమంలో… రెండేళ్లలో నమోదైన కేసుల సంఖ్య ఆధారంగా చూస్తే… దేశవ్యాప్తంగా కిడ్నాప్ అపహరణ కేసుల్లో అత్యధికంగా 14,714 కేసులతో ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం మొదటి స్థానంలో నిలవగా… 10,680 కేసులతో మహారాష్ట్ర రెండో స్థానంలోనూ.. 10,252 కేసులతో బీహార్ మూడో స్థానంలోనూ ఉందని తేలింది. ఈ లిస్ట్ లో ఆంధ్రప్రదేశ్ 18వ స్థానంలో ఉంది.

లెక్కలు ఇలా ఉంటే… స్వయంగా కేంద్ర హోంశాఖ ఇలాంటి నివేధికలు ఇస్తే… పవన్ కి మాత్రం అదే కేంద్రప్రభుత్వంలోని ఇంటెలిజెన్స్ అధికారులు మాత్రం కిడ్నాప్, అపహరణల్లో ఏపీనే నెంబర్ 1 అని, సుమారు 30,000 మంది మహిళలు కిడ్నాప్ అయ్యారని అసత్య ఆరోపణలు చేశారని తెలుస్తుంది. కేంద్రం చెబుతున్న 867 కి పవన్ చెబుతున్న 30,000 కి ఏమైనా సంబంధం ఉందా? అనేది వైసీపీ నుంచి ఎదురవుతున్న ప్రశ్న.

ఏది ఏమైనా… సరైన అవగాహన లేకో, లేక.. స్క్రిప్ట్ లో అలా ఉండటం వల్లో పవన్ ఇలా తప్పుడు లెక్కలు చెబుతూ ప్రజలను మభ్యపెడుతున్నారని అంటున్నారు పరిశీలకులు. ఇలాంటి అజ్ఞానాన్ని ప్రజలపై రుద్దిదే వచ్చే ప్రయోజనం కోసం పవన్ వెంపర్లాడటం కరెక్ట్ కాదని మరికొందమంది అభిప్రాయపడుతున్నారు.

ఏది ఏమైనా… ఈ లెక్కలు పవన్ గుడ్డలూడదీసి నడిరోడ్డుపై కార్టూని చేసి నిలబెట్టాయని అంటున్నారు వైసీపీ నేతలు!