బాస్ మీదే అవినీతి కేసు బుక్ చేసిన సిబిఐ

సిబిఐ చరిత్ర  మరొక చిత్రమయిన మలుపు తిరిగింది.   సొంత బాస్ మీదే కేసు బుక్ చేయాల్సి వచ్చింది. కోట్లాది రుపాలయ కుంభకోణం కు సంబంధించిన కేసులో సిబిఐ స్పెషల్ డైరెక్టర్ నే నిందితుడిగా పేర్కొంది.  ఒక కేసు విచారణలో ఉన్న వ్యక్తి నుంచి సిబిఐ స్పెషల్ డైరెక్టర్ రాకేష్ అస్తాన రెండు కోట్ల లంచం తీసుకున్నట్లు సిబిఐ కనుగొంది. దీనితో ఆ కేసుకు సంబంధించిన ఎఫ్ ఐ ఆర్ లో అస్తానాను నిందితుడిగా పేర్కొనాల్సి వచ్చింది.

అస్తానా గుజరాత్ క్యాడర్ కు చెందిన 1984 బ్యాచ్ ఐపిఎస్ అధికారి. మనీ లాండరింగ్ కేసులో ఇరుక్కుని ఉన్న  మొయిన్ ఖురేసీ మీద సిబిఐ విచారణ చేస్తూ ఉంది. అయితే ఈ కేసులో ఆయన రెండుకోట్లలంచం తీసుకున్నట్లు వెల్లడయింది. 

బయటకు పొక్కిన సమాచారం మేరకు సిబిఐ అరెస్టు చేసిన మనోజ్ కుమార్ అనే వ్యక్తి  రెండు కోట్ల లంచం వివరాలను వెల్లడించాడు. మెజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇస్తూ అస్తాన్ రెండు కోట్ల రుపాయలు లంచం తీసుకున్న మాట నిజమేనని మనోజ్ కుమార్ వెల్లడించాడు.

చాలా కాలంగా సిబిఐ డెరెక్టర్ అలోక్ వర్మకు  స్పెషల్ డైరెక్టర్ రాకేష్ అస్తానాకు గొడవ నడుస్తూ ఉంది.  ఇపుడు అస్తానా మీద కేసు బుక్ అవడం ఈ గొడవలో భాగమేనని అంటున్నారు. అంతకుముందు లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబ సభ్యుల అవినీతి ఆరోపణల  మీద సాగుతున్న విచారణలో అలోక్ వర్మ జోక్యం చేసుకుంటున్నారని ఆస్తానా ఫిర్యాదు చేశారు. దీనితో అస్తానా అవినీతి కూడా వెల్లడవుతున్నది. అయితే, అస్తానమీద అవినీతి అరోపణలు రావడం ఇది మొదటి సారి కాదు. గతంలో గుజరాత్ వాదదోరకు చెందిన ఒకవ్యాపారవేత్త రు. 5200 కోట్లు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోవడానికి సంబంధించిన కేసులో కూడా అస్తానా పేరు ప్రముఖంగా వినిపించింది. (ఫోటో కర్టసీ ది హిందూ)