సిబిఐలో మళ్లీ చెలరేగిన అలజడి

సిబిఐలో మళ్లీ అల్లకల్లోలం చెలరేగింది. సిబిఐ మాజీ డైరెక్టర్ అలోక్ వర్మ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఫైర్ సర్వీసెస్ డిజిగా బాధ్యతలు చేపట్టడానికి ఆయన నిరాకరించారు. ఏకంగా తన సర్వీసుకే  రాజీనామా చేశారు. దీంతో ప్రభుత్వ వర్గాల్లో ఒక్కసారిగా అలజడి రేగింది. దీని పై కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుందోనన్న ఉత్కంఠ మొదలైంది. 

Image result for rakesh asthana cbi director
రాకేష్ ఆస్థానా

మరో వైపు సీబీఐ నంబర్ 2 గా ఉన్న రాకేష్ ఆస్థానాకు ఎదురు దెబ్బ తగిలింది. లంచం కేసులో తనపై నమోదైన ఎఫ్ ఐఆర్ ను రద్దు చేయాలని ఆయన ఢిల్లీ కోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. అయితే రాకేష్ విచారణను ఎదుర్కోవాల్సిందేనని పిటిషన్ కొట్టివేయడానికి కోర్టు నిరాకరించింది. కోర్టు ఆదేశాలతో ఇప్పుడు రాకేష్ ఆస్థానాను అరెస్టు చేసే అవకాశం ఉంది. దీంతో సిబిఐలో మళ్లీ అలజడి చెలరేగింది.