సీబీఐలో ప్ర‌కంప‌న‌లు! అస్థానానూ సాగ‌నంపారు!

సీబీఐలో ప్ర‌కంప‌న‌లు చెల‌రేగ‌డానికి కార‌ణ‌మైన రాకేష్ అస్థానాపై కేంద్రం బ‌దిలీ వేటు వేసింది. ఆయ‌న‌తో పాటు ఇద్ద‌రిని ఇత‌ర శాఖ‌ల‌కు బ‌దిలీ చేస్తూ కేంద్ర హోం మంత్రిత్వ‌శాఖ గురువారం రాత్రి ఉత్త‌ర్వులు జారీ చేసింది. రాకేష్ అస్థానా బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేష‌న్‌కు బ‌దిలీ అయ్యారు. ఏకే శ‌ర్మ‌ను సీఆర్పీఎఫ్ అద‌న‌పు డీజీగా, ఎంకే సిన్హాను బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవ‌ల‌ప్‌మెంట్‌కు స్థాన‌చ‌ల‌నం క‌ల్పించారు.

సీబీఐ డైరెక్ట‌ర్ త‌న ప‌ద‌వికి రాజీనామా చేసిన కొద్దిరోజుల వ్య‌వ‌ధిలోనే ఈ బ‌దిలీలు చోటు చేసుకున్నాయి. కొత్త డైరెక్ట‌ర్‌ను ఎంపిక చేయ‌డానికి ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ నేతృత్వంలోని ప్యానెల్ ఈ నెల 24న స‌మావేశం కానుంది. ఈ నేప‌థ్యంలోనే.. అస్థానాతో పాటు మ‌రో ఇద్ద‌ర్నీ బ‌దిలీ అయ్యార‌ని చెబుతున్నారు. అస్థానాతో పాటు అలోక్ వ‌ర్మ‌పై హైద‌రాబాద్‌కు చెందిన స‌తీష్ సానాబాబు అనే వ్యాపార‌వేత్త నుంచి పెద్ద ఎత్తున ముడుపులు పుచ్చుకున్నార‌నే ఆరోప‌ణ‌లు వ‌చ్చిన విష‌యం తెలిసిందే.