సిబిఐలో చిచ్చు పెట్టింది హైదరాబాదోడే..

దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమయిన విచారణ సంస్థలో మంటలు చెలరేగాయి. ఈ సంస్థను నడిపే ఇద్దరు సీనియర్ అధికారులు, సిబిఐ డైరెక్టర్ అలోక్ వర్మ, స్పెషల్ డైరెక్టర్ రాకేశ్ అస్తానా తన్నుకుంటున్నారు. ఒకరి మీద ఒకరు ఫిర్యాదులు చేసుకుంటున్నారు. ఏతావాతా తేలిందేమిటంటే… సిబిఐలో లంచం ఫుల్ భోంచేస్తున్నారు. బాసులెవరూ ప్రజలనుకున్నంత గొప్పఅధికారులు కాదని, అక్కడ ఉన్నత స్థాయిలో  కోట్లలో లంచం చేతులు మారుతున్నదని  వర్మ, అస్తానా ల గొడవ వల్ల అర్థమవుతుంది. బీ హార్ మాజీ ముఖ్యమంత్రిలాలూ ప్రసాద్  అవినీతి కేసుల మీద తాను చేస్తున్న దర్యాప్తులో సిబిఐ పెద్ద బాస్  అలోక్ వర్మ జోక్యం చేసుకుంటున్నారని అస్థానా అరోపిస్తున్నారు. ఈ మేరకు ఆయన లేఖరాశారో లేదో అస్థాన అసలు రంగు బయటపడింది.  1984 ఐపిఎస్ బ్యాచ్  గుజరాత్ క్యాడర్ కు చెందిన అస్థానా ఒక హావాల కేసులో విచారణ నీరు గార్చేందుకు రెండు కోట్ల రుపాయల  లంచం తీసుకున్నాడని తేలిసింది. ఈ మేరకు ఆయనపేరు ఎస్ ఐ ఆర్ లోకి ఎక్కింది. సిబిఐ రెండో బాస్ గా ఉన్న అధికారి మీద లంచం తీసుకున్న ఆరోపణ రావడం, దీనితో ఆయన పేరు ఎఫ్ ఐ ఆర్లో కెక్కిడం సిబిఐ చరిత్రలో ఇదే ప్రథమం. మరొక ఉన్నత స్థాయి అధికారి ఇంటి మీద సిబిఐ రైడ్స్ చేసింది. సిబిఐ ఇలా బజారు పాలయితే, ఇక విచారణలేమిజరుగుతాయి.

అయితే, ఇంత రాద్ధాంతానికి కారణం హైదరాబాద్ కు చెందిన ఒక రాటుదేలిన వ్యాపారస్థుడే. అతగాడి పేరు సానా సతీష్ బాబు.

రాకేష్ అస్థానా, సిబిఐ స్పెషల్ డైరెక్టర్

  మొయిన్ ఖురేషీ అనే మాంసం ఎగుమతిదారుకొరున్నారు. పేరుకు మాంసం వ్యాపారి కాని చేసిన  హవాలా వ్యాపారం. ఆయన చాలా మంది రాజకీయ నాయకులకు, సీనియర్ అధికారులకు హవాలా, మనీలాండరింగ్ సేవలందిస్తుంటారు.  ఇంత మందితో  ‘సత్సంబంధాలున్నందున ఎక్కడేమి జరిగినా ఖురేషీ పేరు వినబడుతుంది. ఇలా ఆయన  మీద సిబిఐ విచారణ మొదలయింది. దీనిని నడిపిస్తున్న అధికారి రాకేష్ అస్తానా. ఈ కేసుతో సానా సతీష్ బాబుకు కూడా సంబంధం ఉంది. దీనితో ఆయనను కూడా సిబిఐ అధికారులు విచారించాల్సి వచ్చింది. అయితే, సానా మహాముదురు.   తన మీద ఉన్న కేసును తీవ్రత తగ్గించుకునేందుకు  ఏకంగా బేరం పెట్టాడు.  ఎవరితో సిబిఐ స్పెషల్ డైరెక్టర్ తోనే  ఆయనకు  రెండు కోట్ల రుపాయలందించారు కూడా. ఈ విషయాన్ని ఆయనే సిబిఐ మేజిస్ట్రేట్ కు ఇచ్చిన వాంగ్మూలం లో పేర్కొన్నారు.

ఇంతకీ సానా సతీష్ బాబు ఎవరు?

సతీష్ బాబు సానా నోట్లో బంగారు చంచాతో పుట్టలేదు. సాదాసీదా ఎలెక్ట్రిసిటి డిపార్ల్ మెంట్ ఉద్యోగి ఒకపుడు.  అయితే, పట్టువిడుపులు బాగా తెలిసినవాడు కావడంలో అలా అలా ఎంపిల భుజాలమీది నుంచి హావాలా దాకా ఎగబాకిపోయారు. సానా సొంతవూరు కాకినాడ. కరెంటు డిపార్ట్ మెంటు ఆయన ఇరకు కావడంతో హైదరాబాద్ కు మకాం మార్చి ఇక్కడ రకరకాల కంపెనీలు  తెరిచారు. ఈ క్రమంలో ఆయన కు కాంగ్రెస్, తెలుగుదేశం, ఇపుడు వైసిపి ఎంపిల అండదండలుండేవి.

సతీష్ లోలోపల ఎదుగుతూ చాలా పెద్దవాడయిన విషయం 2015లో బయటపడింది. మాంసం ఎగుమతి దారు మొయిన్ ఖురేషి వ్యాపారాలమీద ఎన్ ఫోర్స్ డైరెక్టొరేట్ విచారణ జరుపుతున్నపుడు ఆయన పేరు బయటకొచ్చింది.  ఈ కేసులో పేరొస్తే ఏముంది, ఆయన సిబిఐ లో మంచి కనెక్షన్లు డెవలప్ చేసుకున్నారు. ఈ కేసుల్లో ఉన్నవాళ్లకు, సిబిఐ, ఇడి అధికార్లకు మధ్య వారధిగా ఉండేవాడు. ఇపుడు మళ్లీ అస్థానా లంచం కేసులో సానా పేరు బయటకొచ్చింది. సిబిఐ కేసుల్లో ఉన్న చాలా మంది తెలుగోళ్లకు ఆయన సాయం చేసేవాడు. బెయిల్ ఇప్పించేవాడు, క్లీన్ చిట్ కూడా ఇప్పించేవాడంటారు.

సతీష్ బాబు కంపెనీల జాబితా బాగానే ఉంటుంది. కంపెనీలకు చక్కటి పేర్లుంటాయి. రసమా ఎస్టేట్స్ ఎల్ ఎల్ పి, గోల్డ్ కోస్ట్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్, మాట్రిక్స్ నాచురల్ రిసోర్సెస్ ప్రైవేట్ లిమిటెడ్, గోదావరి బ్రూవరీస్ ప్రవేట్ లి మిటెడ్…. ఈ మధ్య ఆయన ప్రారంభించిన ఎస్ ఆర్ ఎ ఎస్ మరైన్ లాజిస్టిక్స్ లిమిటెడ్ అనే కంపెనీ ఆర్ వొసి (రిజిస్టార్ ఆర్ కంపెనీస్ ) కొట్టేసింది. ఈ కంపెనీలన్నింటిలో ఆయనొక డైరెక్టర్. ఇందులోని గోల్డ్ కోస్ట్ కంపెనీలో మాజీ క్రికెటర్ , తెలంగాణా బ్యాడ్ మింటన్ అసోసియయేషన్ వైస్ ప్రెశిడెంట్  వి చాముండేశ్వరి నాథ్ కూడా డైరెక్టర్ గా ఉండేవాడు. తూర్పు గోదావరి జిల్లా క్రికెట్ అసోషియేషన్ ప్రెశిడెంట్ గా ఉన్నపుడు తనకు ఆయన పరిచయమయ్యాడని చాముండి టైమ్సాఫ్ ఇండియా కు చెప్పారు.

ఛాముండేశ్వరి నాథ్

చాముండేశ్వరి నాథ్ అందించిన వివరాల ప్రకారం, సతీష్ పాలిటెక్నిక్ కాలేజీలో ఎలెక్ట్రికల్ ఇంజనీరింగ్ లో డిప్లొమా వెలగబెట్టాడు. కంపాసినేట్ గ్రౌండ్స్ మీద ఆయనకు విద్యత్ శాఖలో ఉద్యోగమొచ్చింది. తర్వాత ఉద్యోగం మానేసి క్రికెట్ యాక్టివిటీస్ లోకి వచ్చారు. ఆపైనఇలా కంపెనీలకు స్థాపించే స్థాయికి ఎదిగారు. నిమ్మగడ్డ స్థాపించిన కంపెనీలతో కూడా సతీష్ బాబు కు సంబంధాలుండేవి.

సిబిఐ నిఘాలో ఉండి సిబిఐ అధికారులతో స్నేహం చేసుకోవడంలో సానా విజయవంతమయ్యాడు.ఎంబిఎస్ జువెలరీస్ సుఖేస్ గుప్తాకు ఇడి కేసులలో బెయిల్ ఇప్పించేందుకు ఆయన ఢిల్లీకూడా వెళ్లి వచ్చారు. మరొక సారి ఇప్పటి వైసిపి నేత బోత్సా సత్యానారాయణతో కలసి కూడా ఆయన ఢిల్లీ వెళ్లివచ్చారు. ఆ రోజుల్లో బోత్సా మీద ఫోక్స్ వాగన్ కేసును సిబిఐ దర్యాప్తు చేస్తుండేంది. అప్పటి సిబిఐ డైరెక్టర్ ఎపి సింగ్ కి, మాంసం వ్యాపారికి మొయిన్ ఖురేసి మధ్య జరిగిన బ్లాక్ బెర్రీ మెసేజెస్ (బిబిఎం) సంభాషణలు ఇపుడు సిబిఐ దగ్గిరఉన్నాయి. వాటిలో కూడ సానా పేరు చాలా సార్లు  దొర్లింది. దీనితో సానా ఎంత పైకి పోయాడో చూడవచ్చు.

 

తెలుగు నాట ఆయనకు పరిచయం లేని ప్రముఖ నాయకులు, ఆయన సేవలు తీసుకోని నేతలెవరూ లేరని చెబుతారు.