YS Jagan : మూడు సమస్యలతో వైఎస్ జగన్ డీల్ చెయ్యగలరా.?

YS Jagan : ఉత్తరాంధ్రలో విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విషయమై ఉద్యమం రావాల్సిన అవసరం వుందని అంటున్నారు మంత్రి సీదిరి అప్పలరాజు. కర్నూలు జ్యుడీషియల్ క్యాపిటల్ విషయమై రాయలసీమ వైసీపీ ప్రజా ప్రతినిథులదీ ఇదే భావన. నిజానికి, ఏ ప్రాంత ప్రజలైనా.. తమకు దగ్గరగా రాజధాని రావాలని కోరుకోవడంలో తప్పేముంది.? వచ్చిన అవకాశాన్ని వదులుకోవాలని ఎవరు మాత్రం అనుకుంటారు.?

రాజధాని హైద్రాబాద్‌లో వుండబట్టే.. అభివృద్ధి అంతా అక్కడే జరగబట్టే.. తెలంగాణ ప్రాంతంలో విభజన వాదం వచ్చిందని వైసీపీ గట్టిగా నమ్ముతోంది. అందులో ఎంత నిజం వుంది.? అన్నది వేరే చర్చ. తమిళనాడులో, కర్నాటకలో, ఇతర రాష్ట్రాల్లో లేని సమస్య, ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో రావడానికి ప్రత్యేక కారణాలున్నాయి.

సరే, గతం గతః ఇప్పుడేం జరుగుతోంది.? ఏం జరగబోతోంది.? అన్నదే అసలు సిసలు చర్చనీయాంశం. ఉత్తరాంధ్రలో ఉద్యమం వస్తే, రాయలసీమలో కూడా ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడితే.. మిగిలిన ప్రాంతం పరిస్థితేంటి.?

అటు ఉత్తరాంధ్రకి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్.. ఇటు రాయలసీమకి జ్యుడీషియల్ క్యాపిటల్.. మిగిలిన ప్రాంతానికి శాసన రాజధాని.. ఆల్ ఈజ్ వెల్ అనుకోవడానికి వీల్లేని విషయమిది. ఎందుకంటే, కర్నూలుకి చిత్తూరు జిల్లా చాలా దూరమే. కాబట్టి, అక్కడో రాజధాని కావాలి. తిరుపతిని డివోషనల్ క్యాపిటల్ అంటారేమో. శ్రీకాకుళం బాగా వెనకబడ్డ ప్రాంతం.. దానికో రాజధాని కావాలి.. దానికేమన్నా పేరు ఆలోచించుకోవాలిప్పుడు. ఇలా చాలా సమస్యలు వచ్చే అవకాశమూ లేకపోలేదు.

మూడు రాజధానుల రచ్చ ఇప్పుడు ముదిరి పాకాన పడింది.. ప్రాంతీయ వాదాలు.. రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తాయి.. మీ రాయలసీమ పార్టీ మాకొద్దని ఉత్తరాంధ్ర అనుకుంటే.? తెలంగాణలో అదే జరిగింది కదా.?