రఘురామకృష్ణరాజుని బీఆర్ఎస్ పిలుస్తోందిట.! నమ్మొచ్చి.?

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు, 2024 ఎన్నికల్లో ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారన్నదానిపై భిన్న వాదనలున్నాయి. టీడీపీకి ఆయన చాలా దగ్గరయ్యారు. అదే సమయంలో బీజేపీతోనూ ఆయనకు సన్నిహిత సంబంధాలున్నాయి. జనసేనపైనా ఆయన వలపు బాణాలు విసురుతుంటారు.

2019 ఎన్నికల్లో నర్సాపురం నుంచి వైసీపీ తరఫున పోటీ చేసి ఎంపీగా గెలిచారాయన. రఘురామ చేతిలో ఓడిపోయిందెవరో కాదు, జనసేన నేత నాగబాబు. అప్పటికీ ఇప్పటికీ లెక్కలు మారాయ్. జనసేన సానుభూతిపరుడిగానూ రఘురామకృష్ణరాజు వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.

కాగా, భారత్ రాష్ట్ర సమితి ప్రతినిథులు ఇటీవల ఢిల్లీలో ఎంపీ రఘురామకృష్ణరాజుని కలిశారట. ఎవరా ప్రతినిథులు.? అంటే, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్ కుమార్తె కవిత నేతృత్వంలోని బృందమట.

ఈ విషయమై రఘురామ సన్నిహిత వర్గాలు లీకులు పంపుతున్నాయి. ‘జగన్ లాంటి దుష్టుడితో రాజకీయ సావాసం వద్దు..’ అంటూ భారత్ రాష్ట్ర సమితికి రఘురామ సలహాలు ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ సలహాల వెనుక రఘురామ ఆందోళన ఏంటో మరి.!

టీడీపీ, జనసేన కాకపోతే.. బీజేపీ ఎటూ రఘురామకి అందుబాటులోనే వుంటుంది. సో, బీజేపీలోకే రఘురామ వెళతారు తప్ప, భారత్ రాష్ట్ర సమితి వైపు రఘురామ చూసే అవకాశం లేదన్నది ఇంకో వాదన.