రెండు తెలుగు రాష్ట్రాలలో అధికారంలోకి రావాలని బీజేపీ భావిస్తోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి తెలంగాణలో అనుకూల పరిస్థితులు ఉండగా ఏపీలో మాత్రం అనుకూల పరిస్థితులు లేవు. ఏపీలో పుంజుకోవాలని బీజేపీ ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఆ ప్రయత్నాలకు తగ్గ ఫలితాలు మాత్రం దక్కడం లేదు. బీజేపీ జనసేన పొత్తులో ఉన్నప్పటికీ ఈ రెండు పార్టీల మధ్య చాలా విషయాలకు సంబంధించి బేధాభిప్రాయాలు ఉన్నాయి.
చంద్రబాబు సైతం టీడీపీ బీజేపీ పొత్తుపై ఆసక్తి చూపిస్తున్నారు. టీడీపీ బీజేపీ పొత్తు ద్వారా కేంద్రంలో చక్రం తిప్పవచ్చని చంద్రబాబు భావిస్తున్నారు. అయితే బీజేపీ మాత్రం జూనియర్ ఎన్టీఆర్ ను ప్రచారానికి వాడుకోవాలని భావిస్తోంది. అమిత్ షా కోరడంతో బీజేపీ తరపున ప్రచారం చేయడానికి తారక్ అంగీకరించే అవకాశాలే ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. తారక్ బీజేపీలో యాక్టివ్ అయితే టీడీపీ నుంచి మాత్రం విమర్శలు వ్యక్తమయ్యే ఛాన్స్ అయితే ఉంది.
తారక్ సైతం కెరీర్ విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటారు. వీలైనంత వరకు ఇతరుల నుంచి విమర్శలు వ్యక్తం కాకుండా అడుగులు వేసే స్వభావం తారక్ కు ఉంది. కానీ వాస్తవంగా మాత్రం బీజేపీకి తారక్ కంటే టీడీపీతో పొత్తు వల్లే ఏపీలో బెనిఫిట్ కలుగుతుంది. అయితే గతంలో చంద్రబాబు బీజేపీ విషయంలో వ్యవహరించిన తీరు వల్ల ఆ పార్టీ చంద్రబాబును నమ్మే పరిస్థితి కనిపించడం లేదు.
పవన్ కళ్యాణ్ బీజేపీ కంటే టీడీపీకి బెనిఫిట్ కలిగేలా నిర్ణయాలు తీసుకుంటూ ఉండటం కూడా బీజేపీ నేతలను హర్ట్ చేస్తోంది. 2024 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్న నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలలో ఏదో ఒక రాష్ట్రంలో హంగ్ వచ్చే పరిస్థితి ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. 2024 ఎన్నికల్లో కూడా ఏపీలో వైసీపీ, తెలంగాణలో టీ.ఆర్.ఎస్. అధికారంలోకి వచ్చే ఛాన్స్ అయితే ఉందని సర్వేల ఫలితాల ద్వారా వెల్లడవుతోంది.