బిగ్ బ్రేకింగ్… చంద్రబాబు అరెస్ట్!

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం లో అరెస్టైన చంద్రబాబును ఈ రోజు విజయవాడ ఏసీబీ కోర్టులో సీఐడీ అధికారులు ప్రవేశపెట్టారు. ఈ సమయంలో సుమారు ఆరున్నర గంటల పాటు వాదనలు సాగాయి. ఇందులో భాగంగా ఏపీ సీఐడీ తరుపున అడ్వకేట్ జనరల్ సుధాకర్ రెడ్డి, చంద్రబాబు తరుపున సిద్ధార్థ్ లూథ్రా లు వాదనలు వినిపించరు.

ఈ సమయంలో అత్యంత కీలకమైనదిగా చెబుతున్న సెక్షన్ 409 పైనే సుమారు రెండున్నర గంటల పాటు వాదనలు జరిగాయి. ఈ సమయంలో చంద్రబాబు తరుపున న్యాయవాది ఉన్నప్పటికీ… వ్యక్తిగతంగా ఆయన కూడా తన వాదనలు వినిపించే అవకాశం న్యాయమూర్తి కల్పించారు. ఈ సమయంలో ఇది రాజకీయ కక్ష సాధింపు అని తెలిపారు.

ఈ సమయంలో ఈ భారీ కుంభకోణానికి సంబంధించి ఏసీబీ కోర్టులో వాదనలు ముగిసాయి. చంద్రబాబు అరెస్ట్‌ రిమాండ్‌ రిపోర్ట్‌ ను ఏపీ సీఐడీ అధికారులు ఆదివారం ఉదయమే కోర్టుకు సమర్పించారు. ఈ కేసులో 2021లో ఎఫ్.ఐ.ఆర్. నమోదు అయిందని, ఈ విషయంలో మరింతగా విచారించేందుకు చంద్రబాబును 15 రోజుల కస్టడీ ఇవ్వాలని సిఐడీ కోరింది.

ఈ సమయంలో తాజాగా విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి తీర్పును వెలువరించారు. ఈ సందర్భంగా తీవ్ర ఉత్కంఠకు తెరలేపుతూ చంద్రబాబుకు రిమాండ్ విధించారు. 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. ఇదే సమయంలో తీర్పు అనంతరం చంద్రబాబుని రాజమండ్రి సెంట్రల్ జైలు తరలించాలని సూచించారు.