Telugu Film Chamber: థియేటర్ల బందుపై క్లారిటీ ఇచ్చిన తెలుగు ఫిలిం ఛాంబర్

ఇటీవల కాలంలో ఇరు తెలుగు రాష్ట్రాలలోనూ థియేటర్లు బందు కాలు ఉన్నాయని వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, నిర్మాతల మధ్య ఈ చర్చలు గత కొన్ని రోజులుగా జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో వివిధ రకాల వార్తలు బయటకు వస్తుండగా దీనిపై ఫిలిం ఛాంబర్ ఓ స్పష్టత ఇచ్చింది.

ఈ సందర్భంగా తెలుగు ఫిలిం చాంబర్ కార్యదర్శి కేఎల్ దామోదర్ ప్రసాద్ గారు మాట్లాడుతూ… “ఇటీవల వినిపిస్తున్న కొన్ని వార్తలను బేస్ చేసుకుని ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. దీనికై ఉదయం 11 గంటల నుండి ఫిలిం ఛాంబర్ లో ఒక మీటింగ్ నిర్వహించాము. ఈ మీటింగ్ కు రెండు తెలుగు రాష్ట్రాల ప్రముఖ నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు హాజరయ్యారు. ప్రస్తుతం థియేటర్ల పరిస్థితిపై ఉన్న కొన్ని సమస్యల గురించి చర్చలు జరగాయి. మే 1వ తారీకు నుండి థియేటర్లు మూతపడతాయని వార్త బయటకు వెళ్ళింది. కానీ అలా థియేటర్లు మూసి వేయడం అనేది జరగడం లేదు. అది పూర్తిగా ఊహగానం మాత్రమే. ఈనెల 30వ తేదీన ఈసీ మీటింగ్ ఉండబోతుంది. ఆరోజు మూడు సెక్టార్లకు నుండి ఒక కమిటీ నిర్మించబోతున్నాము. ఓ నిర్ణీత సమయంలోనే ఈ సమస్యకు పరిష్కారం వచ్చేలా ఆ కమిటీ పని చేయబోతుంది.

దీనికి సంబంధించిన ఎటువంటి వార్తలేనా ఫిలిం ఛాంబర్ ఇంకా అనుసంధాన సంస్థల నుండి బయటకు వస్తే కేవలం ఆ వార్తలను మాత్రమే ప్రచారం చేయండి. అంతేకానీ బయటనుండి వేరే ఇతర వార్తలు ఏమైనా వస్తే వాటిని దయచేసి నమ్మకండి, ప్రచారం చేయకండి. ఎందుకంటే అటువంటి అబద్ధపు వార్తలు కేవలం చిత్ర పరిశ్రమలో అనవసరమైన ఆటంకాలు తీసుకొస్తున్నాయి. అలాగే ఈ విషయంపై అవసరమైతే ప్రభుత్వంతో కూడా మాట్లాడతాము. గతంలో కూడా కొన్ని సమస్యలకు ప్రభుత్వంతో కూర్చుని చర్చించడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు కూడా చర్చించబోతున్నాము. చిత్ర పరిశ్రమలో ఎటువంటి కష్టాలు వచ్చిన బయట వారు ఎవరు వచ్చి ఆ కష్టాల నుండి బయటకి తీసుకున్నారు. కేవలం ఇండస్ట్రీ మాత్రమే ఆ కష్టాలను స్వయంగా బయట పడుతుంది. అలాగే ఏదో ఒక సినిమాను టార్గెట్ చేసి థియేటర్లు బంద్ చేస్తున్నారు అనే వార్తను పూర్తిగా ఖండిస్తున్నాము. ఇండస్ట్రీకి మంచి జరిగే విధంగానే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఈ సమస్యల నుండి బయట పడి ముందుకు వెళ్తాము” అన్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు ప్రసన్నకుమార్, శ్రీధర్, సుధాకర్ రెడ్డి, శివ ప్రసాద్ రావు, కెఎల్ దామోదర్ ప్రసాద్, భరత్ భూషణ్, వెంకటేశ్వరరావు, సునీల్ నారంగ్, అనుపం రెడ్డి, భరత్ చౌదరి, టి ఎస్ రాంప్రసాద్, సి కళ్యాణ్, ముత్యాల రామదాస్, ఎం సుధాకర్ తదితరులు.

Public Reaction On YS Jagan Warning To Chandrababu Govt || Ap Public Talk || Pawan Kalyan || TR