ఘనంగా మంత్రి అఖిలప్రియ రిసెప్షన్ (వీడియోలు)

ఆంధ్రప్రదేశ్ టూరిజం మంత్రి భూమా అఖిలప్రియ వివాహ రిసెప్షన్ హైదరాబాదు యన్ కన్వెన్షన్ లో ఘనంగా జరిగింది. గత నెల 30వ తేదీన భూమా అఖిల ప్రియా, బార్గవ్ రామ్ నాయుడు వివాహం నంద్యాల లో బందువులు మిత్రుల సమక్షంలో వైభవంగా జరిగింది.

కాగా ఈరోజు హైదరాబాదులో రిసెప్షన్ కార్యక్రమానికి రాజకీయ నాయకులు ,అధికారులు బందువులు తరలి వచ్చారు.
నూతన వధూవరులను ఆశీర్వదించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.

మంత్రి లోకేష్ బ్రాహ్మణి ఇద్దరు నూతన వధువరులను శుభాకాంక్షలు తెలిపారు. భూమా అఖిల ప్రియ సహచర మంత్రులు కూడా ఈ వేడుకకు హాజరయ్యి శుభాకాంక్షలు తెలిపారు. వీడియోలు కింద ఉన్నాయి చూడవచ్చు.