రెండేళ్లుగా మేము ఎక్కడైనా కలిసి కనిపించామా: ప్రభాస్

ప్రభాస్ అనుష్క అమెరికాలో ప్రత్యేకంగా ఇల్లు కొనుకున్నారని, అనుష్క కోసం ప్రభాస్ సాహో ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేశాడని ఆంగ్ల మీడియాలో వార్తలు వచ్చాయి. సాహో విడుదల తర్వాత అనుష్క, ప్రభాస్ పెళ్లి చేసుకోబోతున్నారని కూడా కథనాలు ప్రచురించాయి.
ప్రస్తుతం సాహో ప్రమోషన్‌లో భాగంగా ఓ ఆంగ్ల మీడియాకు ముంబైలో ఇంటర్వ్యూ ఇచ్చిన ప్రభాస్‌కు అనుష్కతో అఫైర్ గురించి మరోసారి ప్రశ్న ఎదురైంది. దీనికి ప్రభాస్ స్పందిస్తూ.. `ఆ మధ్య కరణ్ జోహార్ కార్యక్రమంలోనే ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాను. అప్పుడు రాజమౌళి, రానా కూడా అక్కడే ఉన్నారు. వారు కూడా మా మధ్య ఏమీ లేదని చెప్పారు. అనుష్క నాకు మంచి స్నేహితురాలు మాత్రమే. అనుష్క నేను ప్రేమలో ఉన్నామని మీరు అంటున్నదే నిజమైతే గత రెండేళ్లుగా మేం ఎక్కడైనా కలిసి కనిపించామా? అనుష్కను కలిసి రెండేళ్లకు పైగానే అయిందని ప్రభాస్ చెప్పాడు. అయితే వీరి పెళ్ళి విషయం అవుతుందా లేదా అనేది కాలమే నిర్ణయించాలి