బాలయ్య అమరావతిలో 500 ఎకరాలు,నిజమైతే పెద్ద ఇష్యూనే

బాలయ్య… అమరావతిలో 500 ఎకరాల రచ్చ

ఆంధ్ర ప్రదేశ్ రాజధానిగా అమరావతి భూములపై రకరకాల వివాదలు ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా మరో వివాదం బయిటకు వచ్చింది. ఇక్కడ రాజధానిని ప్రకటించడానికి చంద్రబాబుకు వియ్యంకుడు కమ్ బావమరిది అయిన బాలకృష్ణ, ఆయన బంధువులు కలిపి రాజధాని నిర్ణయం కావడానికి ముందే అమరావతిలో 500 ఎకరాలు కొన్నారని ఆంగ్ల దిన పత్రిక ఇండియన్ ఎక్సప్రెస్ ఓ కథనంలో రాసుకొచ్చింది. ప్రస్తుత సీఎం వైఎస్ జగన్, ఆయన కేబినెట్లోని మంత్రులు కూడా అమరావతి విషయంలో చంద్రబాబు ప్రభుత్వం ఇన్ సైడ్ ట్రేడింగ్‌కి పాల్పడిందని పలుమార్లు ఆరోపించారు.

ఆ కథనంలో రాసి ఉన్నదు ఏమిటంటే.. “గుంటూరు – విజయవాడల మధ్య రాజధాని ఉంటుందని ప్రకటించక ముందే బాలకృష్ణ, తన బంధువుతో కలిసి 500 ఎకరాలను కొనుగోలు చేశారు. తెలుగుదేశం నేతలు ఎంతో మంది ఈ ప్రాంతంలో భూములను ముందే కొన్నారు. ఆ వివరాలన్నీ త్వరలోనే బయటకు వస్తాయి” అని వైసీపీ నేతలు అంటున్నారు.

కాగా, నిన్న పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ, అమరావతిలో జరిగిన ఇన్ సైడర్ ట్రేడింగ్ ను బయటకు తెస్తామని వ్యాఖ్యానించారు. అమరావతిలో భూ సమీకరణ ఓ అతిపెద్ద స్కామ్ అని, తెలుగుదేశం నేతలు రహస్య ప్రమాణాన్ని మీరారని ఆయన ఆరోపించారు. ప్రపంచ బ్యాంకు సైతం ఈ విషయాలను గమనించిన తరువాతనే రాజధాని నిర్మాణానికి నిధులను ఇచ్చేది లేదని తేల్చి చెప్పిందని బొత్స వ్యాఖ్యానించారు.