రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కంచుకోటలో శ్రీకాకుళం జిల్లా కూడ ఒకటి. ఇక్కడ కొన్ని కుటుంబాలు తరాల తరబడి తెలుగుదేశం పార్టీకి వెన్నుదన్నుగా ఉన్నాయి. కింజరపు కుటుంబం, కిమిడి కళా వెంకట్రావు కుటుంబం అలాగే బెందాళం ఫ్యామిలీ, కావలి ప్రతిభా భారతి కుటుంబం ఇలా బలమైన ఫ్యామిలీలు పార్టీకి అండగా ఉన్నాయి. అందుకే గత ఎన్నికల్లో రాష్ట్రమంతా వైసీపీ గాలి వీచినా శ్రీకాకుళంలో టీడీపీ నిలబడగలిగింది. అక్కడ ఇచ్ఛాపురం నియోజకవర్గం నుండి బెందాళం అశోక్ గెలుపొందారు. ఇచ్చ్చాపురం అంటే టీడీపీకి కంచుకోట. 1983 నుండి వట ఎన్నికల వరకు ఒక్క 2004 ఎన్నికల్లో తప్ప మిగిలిన అన్ని ఎన్నికల్లోంబూ టీడీపీ అభ్యర్థులదే విజయం.
అలాంటి కంచుకోటకు బీటలు వారే పరిస్థితి తలెత్తింది. బెందాళం అశోక్ పార్టీ మారనున్నాడనే ప్రచారం ఈమధ్య విస్తృతంగా జరిగింది. అధికారం లేకపోవడంతో నియోజకవర్గంలో ఏమీ చేయలేకపోతున్నామని, అలాగే తనకు అండగా ఉంటూ వచ్చిన కింజరపు కుటుంబం కూడ పార్టీని వీడేలా కనిపించడం, వైసీపీ నుడ్ని కవ్వింపులతో అశోక్ వైసీపీలోకి వెళ్లాలని అనుకున్నారట. కానీ చంద్రబాబు నాయుడు అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడులను పార్టీ వీడకుండా ఆపడంతో అశోక్ పార్టీ మార్పు ఆలోచనను వెనక్కు తీసుకున్నారట. జైలుకెళ్లడం, కరోనా సోకడం, ఆసుపత్రిలో చికిత్స ఇలాతీవ్ర ఇబ్బందులపడిన అచ్చెన్నాయుడుకు ఆశించిన స్థాయిలో టీడీపీ నుండి సపోర్ట్ దక్కలేదు. అందుకే ఆయన పార్టీ మీద అలకబూనారు.
కానీ చంద్రబాబు నాయుడు అచ్చెన్నాయుడును ఐస్ చేసేసి పార్టీ అధ్యక్ష పదవిని ఆయన కోసం సిద్ధం చేశారు. దీంతో అచ్చెన్నాయుడు వెనక్కుతగ్గారు. ఇక అశోక్ కూడ అచ్చెన్నాయుడు మాటను జవదాటరు. గత ఎన్నికల్లో ఇచ్ఛాపురంలో జగన్ గట్టిగా ప్రచారం చేసినా అశోక్ గెలవగలిగారు అంటే వెనుక అచ్చెన్నాయుడు వ్యూహాలు ఉన్నాయి. గెలుపులో ఆయన కీలకంగా పనిచేశారు. అందుకే ఆయనంటే అశోక్ కు మంచి గౌరవం. అచ్చెన్నాయుడు భవిష్యత్తు మీద భరోసా కలిగేలా చర్చలు జరపడంతో అశోక్ తన నిర్ణయాన్ని విరమించుకున్నారని టీడీపీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. మొత్తానికి అచ్చెన్నాయుడు తన జిల్లాలో ఒక ఎమ్మెల్యేను జారిపోకుండా సేవ్ చేసుకోగలిగారన్నమాట.