AP: తాడిపత్రి ఎవరి జాగీరు కాదు… బెదిరింపులకు భయపడేది లేదు: అనంత వెంకటరామిరెడ్డి

AP: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జెసి ప్రభాకర్ రెడ్డి తరచు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈయన అనంత వెంకట్రామిరెడ్డిని టార్గెట్ చేస్తూ ఆయనపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కూటమి నేతలు అయిన పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు నారా లోకేష్ గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే వారి ఇంటికి వచ్చి మరి చెప్పుతో కొడతానని ఈయన దుర్భాషలాడారు.

ఇలా ధర్మవరం తాడిపత్రి ఎమ్మెల్యేలకు మద్దతుగా నిలిచిన అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి సంగతి కూడా చూస్తానని డిసెంబర్ 4వ తేదీ లేదా 5వ తేదీ తన ఇంటికి వెళ్లి తన ఇంటికి గేట్లను పగలగొడతాను అంటూ చేసి ప్రభాకర్ రెడ్డి ఇష్టానుసారంగా మాట్లాడటంతో మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ..

తాడిపత్రి ఎవరి జాగీరు కాదని, వైసీపీ పార్టీ నాయకులంతా వస్తారన్నారు. నీ బెదిరింపులకు తాను భయపడనని నేను అవినీతి చేసి ఉంటే విచారణ చేపించు అంటూ సవాల్ విసిరారు.తాడిపత్రిలోనే కాదు అన్ని నియోజకవర్గాలలో సమావేశాలు ఏర్పాటు చేస్తాం అని వెంకటరామిరెడ్డి చెప్పుకొచ్చారు. నన్ను నా తల్లితండ్రులు చాలా సంస్కారంతో పెంచారు నాలుగు సార్లుగా ఎంపీ ఒకసారి ఎమ్మెల్యేగా నేను గెలిచాను. తాటాకు చప్పుళ్లకు నేను భయపడను దౌర్జన్యమే మీ సంస్కృతిన అంటూ ఈయన ప్రశ్నించారు.

1985 నుంచి జేసీ సంపాదించిన ఆస్తులపై విచారణకు సిద్ధమా?. నాకు సభ్యత ఉంది కాబట్టి ఆయనను నేను తిట్టలేను. జేసీ బెదిరింపులకు నేను భయపడను. తాడిపత్రి ఎవరి జాగీరు కాదు. మా పార్టీ నాయకులంతా వస్తారు, మా నాయకుడు వైఎస్ జగన్ కూడా వస్తారు. తాడిపత్రిలోనే మీటింగ్ కూడా ఏర్పాటు చేస్తాము అంటూ ఈయన జెసి వ్యాఖ్యలపై స్పందిస్తూ ఆయనకు కౌంటర్ ఇచ్చారు.