AP: నూతన సంవత్సరం సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంగళగిరిలోనే క్యాంపు కార్యాలయంలో మీడియాతో చిట్ చాట్ చేశారు ఈ సందర్భంగా మీడియా వారు అడిగే ప్రశ్నలకు ఈయన సమాధానాలు చెప్పారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల గురించి అలాగే గత ప్రభుత్వ హయామంలో జరిగిన పాలన గురించి కూడా ఈ సందర్భంగా ప్రస్తావించారని తెలుస్తుంది.
గత ప్రభుత్వ హయామంలో ఐదేళ్ల పాటు అన్ని వ్యవస్థల్లో విధ్వంసం చేశారని, గత ప్రభుత్వ పాలన నేరాలు, ఘోరాలకు అడ్రస్‌గా మారిందన్నారు. ప్రభుత్వం ముందు ఎన్నో చిక్కుముడులు ఉన్నాయని ఒక్కోటి విప్పుకుంటూ అభివృద్ధి వైపు ముందడుగు వేస్తున్నామని బాబు తెలిపారు. 1995 నాటి ముఖ్యమంత్రిని మీరు మళ్లీ చూస్తారని, జగన్ మాదిరి తాను కక్ష పూరిత రాజకీయాలు చేయటం లేదని తెలిపారు. అలా కక్ష సాధింపు చర్యల కోసమే ప్రజలు నన్ను గెలిపించలేదని ఈయన తెలిపారు.
ఒకవేళ నేను కక్ష సాధింపు చర్యలే చేపడుతూ ఉంటే ఈపాటికి జగన్ రెడ్డి జైలులో ఉండేవారని బాబు తెలిపారు. తప్పు చేసిన వారిని ఎవరిని వదిలి పెట్టమని అయితే అందరి సంగతి ఒకేసారి చూడాలి అంటే కుదరదు అంటూ చంద్రబాబు తెలిపారు. తప్పు చేసిన ఏ ఒక్కరు కూడా శిక్ష నుంచి తప్పించుకోలేరని ఈయన ఈ సందర్భంగా చెప్పకనే చెప్పేశారు..
గత ప్రభుత్వంలో ల్యాండ్, శాండ్,మైన్స్‌లో అక్రమాలకు పాల్పడ్డారని, వాటిని కొద్దిగా గాడిలో పెట్టామన్నారు. ప్రస్తుతం మన రాష్ట్రంలో 64 లక్షల మందికి..34 వేల కోట్ల పెన్షన్ ఇస్తున్నామని, సంక్షేమం..అభివృద్ధికి సమ ప్రాధాన్యం ఇస్తున్నట్టు చెప్పారు. రాష్ట్రాన్ని వెల్ఫేర్ లైన్ లోకి తెచ్చామని, సూపర్ సిక్స్ పథకాలు కూడా అమలు చేస్తున్నామని చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.