బిగ్ బ్రేకింగ్ : ఆంధ్రప్రదేశ్‌లో కీలక సర్వే ప్రకటించిన జగన్ ? 

AP government to start land survey from January
వైఎస్ జగన్ ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్నాక ఒక భారీ కార్యక్రమాన్ని  చేయడానికి కంకణం కట్టుకున్నారు.  పాత ముఖ్యమంత్రుల్లో చాలామంది ముఖ్యమంత్రులు చేయలేని పని అది.  ఆ పనిని ఇప్పుడు జగన్ చేయనున్నారు.  అదే సమగ్ర భూసర్వే.  రాష్ట్రం మొత్తం భూములను హద్దులతో సహా లెక్కగట్టి యజమానులు ఎవరనేది పక్కాగా  తేల్చి శాశ్వత భూ హక్కు కల్పించడమే ఈ సమగ్ర భూసర్వే లక్ష్యం.  ఈమేరకు నిన్న రాష్ట్ర కేబినెట్ కీలక నిర్ణయం ప్రకటించింది.  వైఎస్సార్ జగనన్న శాశ్వత భూమి హక్కు- భూమి రక్షణ పేరుతో అన్ని భూముల రీ-సర్వే జరిపించాలని కేబినెట్ నిర్ణయించింది.
 
AP government to start land survey from January
 
రాష్ట్రంలో రిజిస్టేషన్ అయి ఉన్న భూమి కంటే రికార్డుల్లో ఎక్కువ భూమికి డాక్యుమెంట్లు ఉన్నాయని ప్రభుయత్వం గుర్తించింది.  ఈ ఫక్ డాన్యుమెంట్లలో ఉన్న భూమి విస్తీర్ణం మొత్తం 30 లక్షల ఎకరాలుగా ఉంది.  అంటే రాష్ట్రంలో 30 లక్షల ఎకరాల భూమికి అసలైన హక్కుదారులు కబ్జాకోరుల వలన తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.  ఇలాంటి వారందికీ విముక్తి కల్పించడం కోసమే జగన్ సర్కార్ ఈ సమగ్ర భూ సర్వేను అవలంభించనుంది.   ఈ ప్రక్రియ కోసం 4,500 సర్వే టీమ్‌లను సిద్దం చేశారు.  సుమారు 1000 కోట్ల రూపాయలను ఈ సర్వే కోసం ఖర్చు పెట్టనుంది ప్రభుత్వం.  
 
 
AP government to start land survey from January
2021 నుండి 2023 అంటే రెండేళ్లలో దశలవారీగా ఈ సర్వే ముగియనుంది,  ఖచ్చితమైన హద్దులను గుర్తించి ప్రభుత్వమే సర్వ్ రాళ్లను అందించనుంది.  30 లక్షల దొంగ డాక్యుమెంట్లుగా అంటే అనేక సివిల్ కేసులు నమోదయ్యే ఆస్కారం ఉంది.  ఈ కేసులను త్వరితగతిన పరిష్కరించడానికి మొబైల్ కోర్టులను సైతం ఏర్పాటుచేయనున్నారు.  ఈ సర్వే నగరాలు, పట్టణాలు అన్నింటిలోనూ జరగనుంది.   గడిచిన 100 ఏళ్లలో రాష్ట్రంలో ఈ స్థాయిలో భూ సర్వే జరిగింది లేదు.  మొత్తం లక్ష చదరపు కిలీమీటర్లకు పైగా ఈ సర్వే  సాగనుంది.