ఇక జన్మలో చంద్రబాబు పార్టీ NDA లోకి అడుగు కూడా పెట్టలేదు, జగన్ మాస్టర్ స్కెచ్

AP government shocks Ashok Gajapathi Raju

ఏపీలో మొత్తం 7 పార్టీలు ఉంటే .. వాటిల్లో మూడు ప్రాంతీయ పార్టీలు , నాలుగు నేషనల్ పార్టీలు. ఇక ప్రాంతీయ పార్టీల్లో వైసీపీ , టీడీపీ .. అధికారాన్ని , విపక్షాన్ని పంచుకుంటే జనసేన ఇంకా గుర్తింపుకు తహతహలాడుతోంది. ఇక నేషనల్ పార్టీల్లో కాంగ్రెస్, వామపక్షాలు ఉనికి కోసం ప్రయత్నిస్తుంటే, ఒక్క బీజేపీ మాత్రమే కొంచెం యాక్టీవ్ గా ఉంది. అయితే రాష్ట్రంలో బీజేపీ బలంగా ఉంది అని చెప్పలేని పరిస్థితి.

cm jagan modi
 

ఇదిలా ఉంటే బీజేపీ ఇప్పటికి చాలాసార్లు టీడీపీతో స్నేహం చేసింది. అధికారాన్ని రెండు పార్టీలు పంచుకున్నాయి, విడిపోయాయి. అయితే బీజేపీకి ఇపుడు ఆశలు పెరిగాయి, ఇక పై ఎట్టి పరిస్థితుల్లోనూ టీడీపీతో పొత్తులు పెట్టుకోరాదని మోడీ అమిత్ షా లెవెల్లోనే కచ్చితమైన నిర్ణయం తీసుకున్నారు అంటున్నారు. వారిద్దరికీ చంద్రబాబు ఏంటో బాగా తెలిసిపోయిన సమయంలో ఇక బాబుకి కొంచెం దూరంగా ఉండాలనే నిర్ణయించారట.

అయితే, వైసీపీతో బీజేపీ రిలేషన్స్ ఎలా ఉంటాయి అన్న దాని మీద అయితే ఇప్పటికీ ఎవరికీ క్లారిటీ లేదు. కానీ పై లెవెల్లో అంటే మోడీ, అమిత్ షా జగన్ లెవెల్లో మాత్రం మంచి అవగాహన ఉందని అంటున్నారు. ఏపీ వరకూ జగన్ ని నమ్మకమైన మిత్రుడిగా మోడీ షాలు చూస్తున్నారని తెలుస్తోంది. 2024 కానీ అంతకు ముందు కానీ ఎన్నికలు జరిగితే ఒకవేళ బీజేపీకి కేంద్రంలో అధికారానికి సీట్లు తగ్గినా ఏపీ లో జగన్ మద్దతుగా నిలుస్తాడు అని అంటున్నారు. ఏపీ బీజేపీ నాయకులు ఎంతగా జగన్ మీద విమర్శలు చేసినా రెచ్చగొట్టినా జగన్ ఏ మాత్రం పట్టించుకోవాల్సిన అవసరం అయితే అసలు లేదు. ఎందుకంటే కాగల కార్యం హై కమాండ్ వద్దనే జగన్ తేల్చుకుంటారు అన్నది తెలిసిందే. ఇక ఏపీలో పోలవరం ప్రాజెక్ట్ కి సవరించిన నిధులను పూర్తిగా భరించేందుకు కేంద్రం ముందుకు రావడం అంటే ఏపీలో తాము జగన్ పక్షంగా ఉన్నట్లు బలమైన సంకేతమే అది. అలాగే జగన్ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రాయలసీమ ఎత్తి పోతల పధకానికి కేంద్ర జల సంఘం క్లియరెన్స్ ఇవ్వడమూ వైసీపీతో దోస్తీలో భాగనే అంటున్నారు. అందువల్ల జగన్ ఏపీలో ఉండాలి. ఢిల్లీ కోటలో బీజేపీ ఉండాలి ఇదే ఒప్పందం