2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన అధికారంలోకి రావడం కోసం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వేర్వేరుగా కష్టపడుతున్నారనే సంగతి తెలిసిందే. అయితే ఎన్నికల్లో గెలవడం కోసం ఈ ఇద్దరు నేతలు జగన్ పై విమర్శలు చేయడాన్నే ఆయుధంగా మలచుకున్నారు. బీజేపీ సైతం ఏపీలో వైసీపీని ఓడించడానికి ప్రాధాన్యతనిస్తోంది. పులివెందులలో జగన్ ను ఓడించడానికి టీడీపీ, జనసేన ఎంత కష్టపడినా ఫలితం ఉండదు.
పులివెందులలో అభివృద్ధి జరిగినా జరగకపోయినా వైఎస్ జగన్ పై అక్కడి ప్రజల్లో అభిమానం అలాగే ఉంటుందే సంగతి తెలిసిందే. దాదాపుగా ఏపీలోని అన్ని పార్టీలు జగన్ టార్గెట్ గా రాజకీయాలు చేస్తున్నాయి. జగన్ ను ఓడించడమే లక్ష్యంగా ఎంతోమంది కష్టపడుతున్నా ప్రజలు మాత్రం జగన్ విషయంలో పాజిటివ్ గా ఉన్నారు. ప్రకాశం, నెల్లూరు జిల్లాలతో పాటు రాయలసీమలో జగన్ కు క్రేజ్ పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు.
ఇతర జిల్లాలలో కొన్ని నియోజకవర్గాలలో జగన్ కు పాజిటివ్ గా ఉంటే మరికొన్ని నియోజకవర్గాలలో నెగిటివ్ ఫలితాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. జగన్ కొన్ని విషయాల్లో గ్రేట్ అని సామాన్య ప్రజలు సైతం చెబుతున్నారు. కరోనా వల్ల ఆదాయం తగ్గినా జగన్ స్థాయిలో సంక్షేమ పథకాలను అమలు చేసిన సీఎం అయితే లేరని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
నాడు నేడు ద్వారా జగన్ ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను పూర్తిస్థాయిలో మార్చేశారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం అమలు ద్వారా భవిష్యత్తు తరాలకు కచ్చితంగా మేలు జరుగుతుందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. జగన్ 2024లో కూడా వైసీపీని గెలిపించుకుంటే తమకు మరింత మంచి జరుగుతుందని ప్రజలు భావిస్తున్నారు.