అద్భుతం – మహాద్భుతం -ఏపీలో రాజధానుల శంకుస్థాపనకి డేట్ ఫిక్స్ ??

AP CM Jagan is taking a crucial step in soon

ఏపీ సీఎం జగన్ మూడు రాజధానుల విషయంలో ఒక కీలక అడుగులు వేస్తున్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమ విషయంలో కేంద్రం వైఖరి స్పష్టంగా అర్ధమైంది. విశాఖ ఉక్కుని అమ్మాలి అని కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని సిఎం జగన్ ఏ మాత్రం కూడా తప్పుబట్టడం లేదు. కేంద్ర నిర్ణయానికి వ్యతిరేకంగా ఎటువంటి వ్యాఖ్యలు కూడా చేయలేదు. ఈ నిర్ణయానికి అన్ని విధాలుగా వైసీపీ ఎంపీలు కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారు అని పరిశీలకులు భావిస్తున్నారు.

AP CM Jagan is taking a crucial step in soon
AP CM Jagan is taking a crucial step in soon

అందుకే మూడు రాజధానుల విషయంలో న్యాయ రాజధానికి కేంద్రం పరోక్షంగా పార్లమెంట్ లో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది . రవిశంకర్ ప్రసాద్ దీనిపై చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం అయ్యాయి. అందుకే సిఎం జగన్ మూడు రాజధానుల విషయంలో విశాఖలో లేదా కర్నూలులో హైకోర్ట్ నిర్మాణానికి శంకుస్థాపన చేసే అవకాశాలు ఉన్నాయని సమాచారం.

ఇది రాష్ట్ర మరియు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పరిధిలో అంశమని కేంద్ర స్పష్టం చేయటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఉగాది రోజున సీఎం చేతుల మీదుగా శంకుస్థాపన చేయవచ్చు అని అంటున్నారు. జగన్ ఉక్కు పరిశ్రమలో సైలెంట్ గా ఉండటానికి ఇదే కారణమని తెలుస్తుంది. అయితే పరిపాలన రాజధాని విషయంలో మాత్రం కేంద్రం సహకారం అందించే అవకాశం లేదని, అది వివాదాస్పద అంశం కాబట్టి సైలెంట్ గా ఉన్నారని అంటున్నారు.

ఉగాది రోజున ఈ శంకుస్థాపన కార్యక్రమానికి కేంద్ర మంత్రులు వచ్చే అవకాశాలు ఉన్నాయని సమాచారం. రవిశంకర్ ప్రసాద్ కి ఆహ్వానం పంపే యోచనలో ఏపీ సర్కార్ ఉంది. మరి కేంద్ర మంత్రి వస్తారా లేక అనవసర వివాదం ఎందుకని ప్రేక్షకుడిగా ఉండిపోతారా అన్నది చూడాలి.