ఆంధ్రప్రదేశ్ రైతులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం .. ఇకపై 80% రాయితీతో విత్తనాలు..?

దేశానికి రైతులు వెన్నెముక లాంటివారు రైతుల ఐదు వేళ్ళూ భూమిలోకి వెళితేనే మన ఐదు వేళ్ళు నోటిలోకి వెళతాయి. దేశానికి వెన్నెముకగా నిలుస్తున్న రైతన్నలు అతివృష్టి, అనావృష్టి కారణంగా తీవ్రంగా నష్టపోతున్నారు. అయితే రైతులను ఆదుకోవటానికి కేంద్ర ప్రభుత్వాలు ఇప్పటికే ఎన్నో పథకాల ద్వారా ఆర్థిక సహాయం చేస్తున్నాయి. ముఖ్యంగా పంట రుణాలు మాఫీ చేయడం, నష్టపరిహారాన్ని చెల్లించటం వంటి పథకాల ద్వారా రైతులు లబ్ధి పొందుతున్నారు. అంతేకాకుండా రైతుల పెట్టుబడి కి అవసరమైన ఆర్థిక సహాయాన్ని కూడా కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు అందజేస్తున్నాయి.

తాజాగా ఆంధ్రప్రదేశ్ రైతులకు ప్రభుత్వం శుభవార్త తెలియజేసింది. రైతులు పంటలు పండించడానికి అవసరమైన విత్తనాలను 80% రాయితీతో రైతులకు అందజేయాలని జగన్ అధికారులను ఆదేశించాడు. అంతేకాకుండా తీవ్ర వర్షాల కారణంగా పంట నష్టం కూడా అధికంగా ఉంది. వర్షాల కారణంగా విత్తనాల రంగు మారినా కూడా వాటి ధర తగ్గించకుండా రైతుల నుండి సరైన ధరకు కొనుగోలు చేయాలని ఇటీవల జరిగిన కలెక్టర్ల సమావేశంలో జగన్మోహన్ రెడ్డి అధికారులకు సూచించాడు. అంతేకాకుండా అధిక వర్షాల వల్ల లోతట్టు ప్రాంతాలలో పంట నష్టంతో పాటు ప్రాణా నష్టం కూడా జరుగుతుంది.

ఇలా అధిక వర్షాల కారణంగా పంట నష్టం జరిగిన రైతులకు, అలాగే ఇలా ముంపుకు గురైన ప్రజలకు 2000 రూపాయల ఆర్థిక సహాయంతో పాటు ఉచిత రేషన్ బియ్యం కూడా అందించాలని సీఎం అధికారులను ఆదేశించాడు. ఇక రైతులు మరణించిన కుటుంబాలకు నష్టపరిహారం కూడా అందజేయవలసినదిగా అధికారులను ఆదేశించాడు. ఇటీవల జరిగిన కలెక్టర్ల సమావేశంలో సీఎం తీసుకున్న ఈ కీలక నిర్ణయాల పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వంట నష్టం అందించటమే కాకుండా 80% రాయితీతో విత్తనాలు అందజేయడంతో రైతులు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు.