పవన్ కళ్యాణ్‌కి కేసీయార్ వెయ్యి కోట్ల ప్యాకేజీ ఆఫర్ చేయడమేంటి.? ఫక్కున నవ్వుకుంటున్నారు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి అధినేత రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలపై. బహుశా ఈ రాత రాయడానికి ఆయనకు మంచి ప్యాకేజీనే దక్కి వుంటుందన్నది సర్వత్రా వినిపిస్తోన్న వాదన.!
రాధాకృష్ణ గురించీ, ఆయన కుటుంబ సభ్యుల గురించీ సోషల్ మీడియాలో వినిపిస్తున్న ఊహాగానాల్ని ఇక్కడ ప్రస్తావించడం అనవసరం. మీడియా ముసుగులో ఏదైనా చేస్తా.. అని ఆర్కే అనుకుంటే.. ఇదిగో ఇలాగే.. కుటుంబ సభ్యుల్ని రచ్చకీడ్చుతారు. అఫ్‌కోర్స్ రాధాకృష్ణకి ఇలాంటివి అలవాటే. ఇంతకీ, ఆ వెయ్యి కోట్ల స్క్రిప్ట్ ఎప్పుడు తయారైంది.? అంటే, జస్ట్ కొద్ది రోజుల క్రితమేనట. టైమ్ చూసి దాన్ని వదులుదామనుకుని.. సరైన సమయం వచ్చిందనుకుని తాజాగా వదిలారట. అలాగని, మీడియా అలాగే రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. జరగదా మరి.? ఆయనేనా జోస్యం చెప్పేది.?
గాసిప్స్ రాసేది.? జనానికి కూడా అలాంటివి చేతనౌతాయ్.! చిత్రమేంటంటే ఏబీఎన్‌లో పనిచేసే మీడియా ప్రతినిథులే ఈ వెయ్యి కోట్ల ప్యాకేజీని చూసి నవ్వుకుంటున్నారు. కానీ, పైకి గట్టిగా చెప్పలేరు కదా.! ‘బహుశా ఏబీఎన్ రాధాకృష్ణ మతి భ్రమించి వుంటుంది.. లేదీ, ఈ వార్త కోసం ఆయనకు ప్యాకేజీ గట్టిగా ముట్టి వుంటుంది..’ అన్నది ప్రముఖంగా వినిపిస్తున్న వాదన.
వైసీపీ కూడా ఈ గాసిప్‌ని చూసి నవ్వుకుంటోంది. ‘మేం మొదటి నుంచీ చెబుతున్నాం.. జనసేనకు టీడీపీ నుంచే ముప్పు పొంచి వుంది. ఆ విషయం పవన్ కళ్యాణ్‌కే అర్థం కావడంలేదు’ అన్నది వైసీపీ వాదన. ఈ వ్యవహారంలో వైసీపీ నుంచి జనసేన మీదకు కాస్త సింపతీ వస్తుండడం ఆసక్తికరం.