రాజకీయ పార్టీలు వేరు, ప్రభుత్వం వేరు.. కానీ ఆంధ్రప్రదేశ్‌లో వైకాపా ప్రభుత్వం ఏర్పాటు చేసి సంవత్సరం అవుతోన్న ఈ తేడాను ఇంకా గుర్తించినట్లు లేదు..! అందుకే నోటీసుల పేరుతో విపక్ష పార్టీల నేతల గొంతు నొక్కాలని భావిస్తోంది.. వ్యక్తిగత విమర్శలు చేస్తోంది.
ఈ మాటలు అంటోంది.. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి. వైకాపా తీరుపై బాగా కోపం వచ్చి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పైగా తన స్థాయి, హోదాను కూడా గుర్తు చేశారు. కేంద్ర సహాయ మంత్రి హోదా ఉంది కాబట్టి ఎక్కడైనా తిరిగే వెసులు బాటు ఉందని, అవగాహన లేక తనకు క్వారెంటైన్‌లో ఉండాలని పోలీసులు నోటీసుకు ఇచ్చారని ఆయన మండి పడుతున్నారు.
విషయం ఏమిటంటే.. NYKS ప్రభుత్వ అధికారిక క్రీడలు మరియు యువజన వ్యవహారాల విభాగం. దీనికి గౌరవ అధ్యక్షులుగా దేశ ప్రధాన మంత్రి, చైర్మన్ గా కేంద్ర క్రీడలు & యువజన వ్యవహారాల శాఖామంత్రి , వైస్ చైర్మన్ గా నేను నామినేటెడ్ సభ్యులు, గౌరవ సభ్యులుగా ముగ్గురు పార్లమెంట్ సభ్యులుంటారు. ఇది దేశంలోని 28 రాష్ట్రాలు, 9 కేంద్ర పాలిత ప్రాంతాల్లో వివిధ మంత్రిత్వ శాఖలతో కలిసి తన విధులను నిర్వర్తిస్తుంది.
ఈ విభాగం వైస్ చైర్మన్ సభ్యులు పర్యటించే సందర్భంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వాలు అతిధిగా అధికారిక వాహనాలు, వసతులు, భద్రత చూసుకుంటారు. అందులో భాగంగానే సంస్థ జాతీయ ఉపాధ్యక్షుడి హోదాలో విష్ణు వర్థన్ రెడ్డి కర్నూలు జిల్లాలో ఉన్న ప్రస్తుత పరిస్థితిని సమీక్షించి భారత ప్రభుత్వ క్రీడల మంత్రిత్వ శాఖ ద్వారా చేయాల్సిన సేవా కార్యక్రమాలపై అధికారిక సమీక్షా సమావేశం నిర్వహించారు. దానిపై ముందుగా రాష్ట్ర, కేంద్రం ప్రభుత్వాలకు సమాచారం కూడా ఇచ్చారట. సామాజిక దూరం కూడా పాటించారట.
కానీ అవేమీ పట్టించుకోకుండా.. విష్ణు వర్థన్ రెడ్డిని స్వీయ నిర్భందంలో ఉండాల్సిందిగా ప్రభుత్వ అధికారులు నోటీసులు అవ్వడంతో ఆయనకు కోపం వచ్చింది. వైకాపా మంత్రులు తిరిగినప్పుడు ఇవన్నీ కనపడవా.. కేవలం విపక్షాల వారికే వర్తిస్తాయా అంటూ మండి పడ్డారు.
మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, బొత్సా సత్యనారాయణ కూడా పర్యటించారు మరి వాళ్ళకు కూడా నోటీసులు ఇచ్చి, క్వారంటైన్ లో పెడతారా? అంటూ ప్రశ్నించారు. మరి బీజేపీ నేత చేసిన ఈ వ్యాఖ్యలకు అధికార వైకాపా ఎలాంటి సమాదానం ఇస్తుందో చూడాలి. Somagutta Vishnuvardhan Reddy