మూడు రాజధానుల పై హైకోర్టు ధర్మాసనం నర్మ గర్భ వ్యాఖ్య

ఆంధ్ర లో న్యాయ వ్యవస్థ, ప్రభుత్వం మధ్య ఘర్షణ వైఖరి

ప్రతి పాదనకు చెందిన చట్టాలు ఆమోదం పొందక మునుపే రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కార్యాలయాలను కర్నూలుకు తరలించుతున్నదని కొందరు హైకోర్టు కెక్కిన అంశం విదితమే. ఈ సందర్భంగా పిటిషన్ దారులు అధికారులు నిబంధనలు అతిక్రమించుతున్నారని ప్రభుత్వ సలహా దారులు న్యాయమూర్తులపై చేసిన వ్యాఖ్యానాలు అఫిడవిట్ లో పొందు పర్చడం పై న్యాయ మూర్తులు అభ్యంతరం వెలుబుచ్చారు. ఈ అంశాలు తొలగించాలని ఆదేశించారు.

ఈ సందర్భంలో పిటిషనర్ లాయరు ప్రభుత్వ సలహాదారులు చేసిన ప్రసంగాలు న్యాయం వ్యవస్థను కించ పర్చే విధంగా వున్నాయని చెప్పగా న్యాయ మూర్తి ఈ కేసుకు వ్యాఖ్యానాలకు సంబంధం లేదని చెబుతూ ఎవరెవరు ఏం మాట్లాడింది తమ వద్ద సమాచారం వుందని న్యాయ వ్యవస్థ ప్రతిష్ట ఏలా కాపాడుకోవాలనో తమకు తెలుసునని నర్మ గర్భంగా వ్యాఖ్యచేయడం సంచలనంగా మారింది.

అయితే ప్రభుత్వ కార్యాలయాల తరలింపుపై హైకోర్టు కీలక వ్యాఖ్యానాలు చేసింది. కార్యాలయాలకు స్థలం లేనందున తరలించుతున్నామని ప్రభుత్వ లాయర్ వాదనతో కోర్టు సంత్రుప్తి పడ లేదు. స్థలం లేక పోతే వేరే చోటకు తరలించాలిగాని వేరే ప్రాంతానికి తరలించడం ఎందుకని ప్రశ్నించింది. కేసు విచారణ సోమవారానికి వాయిదా వేసింది.