వైసిపి, టిడిపిపై పురంధేశ్వరి ఫైర్

టిడిపి వైసిపి చేస్తున్న రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారని బిజెపి నాయకురాలు పురంధేశ్వరి అన్నారు. కేంద్రం పై విమర్శలు చేసే ముందు బేరిజు చేసుకొని మాట్లాడాలని ఆమె టిడిపి వైసిపిలకు సూచించారు. టిడిపి నేతలు అబద్దాలు, గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని పురందేశ్వరి దుయ్యబట్టారు. కేంద్రం సాయంతోనే ఏపీ అభివృద్ది చెందుతుందని, ఏపీ పట్ల కేంద్రం ఉదాసీనత వ్యవహరిస్తుందన్నారు. స్టీల్ ప్లాంట్ లను అడ్డుకుంటున్నది ఏపీ ప్రభుత్వం కాదా అని ఆమె ప్రశ్నించారు.