ఈ మధ్య Centre for the Study of Developing Societies-Lokniti నిర్వహించిన ఒక సర్వేలో కొన్ని ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 8 నియోజకవర్గాలలో కొన్ని సాంపిల్స్ సేకరించి వాటిని కులాలు వారిగా విశ్లేషించారు.
మొదటగా సర్వేలో పాల్గొన్న రెడ్ల సమాచారం విశ్లేషిస్తే , దాదాపు 75% మంది వైస్సార్సీపీ కి ఓటు వేస్తాము అని చెప్పగా 12% మంది టీడీపీ తమ అభిమాన పార్టీ గా చెప్పారు. ఆశ్చర్యంగా 6.5% మంది ఇంకా కాంగ్రెస్ వైపు ఉన్నట్టు తెలుస్తుంది . మిగతా 6% బీజేపీ మరియు ఇతరులను తమ అభిమాన పార్టీలుగా చెప్పుకొచ్చారు.
అలాగే సర్వ్ లో పాల్గొన్న కమ్మల సమాచారం విశ్లేషిస్తే, దాదాపు 88% మంది టీడీపీ వైపు మొగ్గుచూపగా కేవలం 6% మంది మాత్రమే వైస్సార్సీపీ వైపు మొగ్గు చూపారు . మిగతావారు ఇతర పార్టీలకి ఓటు వేస్తామని చెప్పారు . ఆశ్చర్యం ఏంటంటే కమ్మలలో కనీసం ఒక్కరు కూడా కాంగ్రెస్ కు గా బీజేపీ కి గాని ఓటు వేస్తాము అని చెప్పకపోవడం .
పైన విశ్లేషించిన ఫలితాలునుబట్టి అర్థమవుతుంది ఏంటంటే వైసీపీ కి రెడ్లలో వున్నా ఆధారణకంటే కమ్మలు టీడీపీకి బలంగా మద్దతు తెలుపుతున్నారు. వైసీపీ రెడ్ల ఓటు బ్యాంకుని కాంగ్రెస్ తో పంచుకోవాల్సిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది .
గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో రెడ్లలో కేవలం 4 శాతం ఓట్లు పొందిన కాంగ్రెస్ ఇప్పుడు తన బలం పెంచుకొని ఓటింగ్ శాతం ని 6.5 శాతం వరకు పెంచుకోలిగింది. 2014 ఎన్నికల్లో కేవలం 2 శాతం ఓట్లతో అధికారం పోగుట్టుకున్న వైసీపీ కి ఇది ఆందోళన కలిగించే అంశమే.
రాబోయే ఎన్నికల్లో టీడీపీ మరియు కాంగ్రెస్ కలిసి పోటీచేయాలనుకుంటున్న తరుణంలో కాంగ్రెస్ బలం పెరగడం అంటే అది చంద్రబాబు గారిని మరింత బలవంతుడిని చెయ్యడమే .
గమనించవలసిన విషయం ఏంటంటే కాంగ్రెస్ ఒంటరిగా పోటీచేస్తే కాంగ్రెస్ కు ఓటు వెయ్యడం వేరు కాంగ్రెస్ టీడీపీ తో పొత్తు పెట్టుకున్న తర్వాత రెడ్ల సామాజికవర్గం టీడీపీకి మద్దతిస్తారా అనేది ఆసక్తికరంగా ఉండబోతుంది . అయితే ఇప్పటికి కాంగ్రెస్‌నే అట్టిపెట్టుకున్నవారు ఖచ్చితంగా జగన్ ని లేకుంటే వైసీపీ ప్రాంతీయ నాయకత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకించే వాళ్ళయివుంటారు కనుక టీడీపీకి ఓటు వేసే అవకాశం లేకపోలేదు.
అన్నిటికి సమాధానం 2019 సార్వత్రిక ఎన్నికల ఫలితాలే …అప్పటివరకు వేచివుండడమే