కార్తీకదీపం సీరియల్ ద్వారా వంటలక్క డాక్టర్ బాబు ఎంత సంపాదించారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

బుల్లితెర ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నటువంటి కార్తీకదీపం సీరియల్ గురించి మనకు తెలిసిందే. ఈ సీరియల్ రెండు తెలుగు రాష్ట్రాలలో విశేషమైన ఆదరణ సంపాదించుకుంది. ముఖ్యంగా ఈ సీరియల్ లో నటించిన వంటలక్క డాక్టర్ బాబు పాత్రలకు ఎంతో మంచి ఆదరణ లభించింది. వంటలక్క పాత్రలో నటించిన ప్రేమి విశ్వనాథ్ ఈ సీరియల్లో మినహా ఇతర ఏ తెలుగు సీరియల్ లోను కనిపించలేదు. ఇక డాక్టర్ బాబుగా నిరూపమ్ పరిటాల ఇదివరకే ఎన్నో తెలుగు సీరియల్స్ లో నటించి సందడి చేశారు. అయితే ఈ సీరియల్ ద్వారా వచ్చిన క్రేజ్ ఏ ఇతర సీరియల్స్ ద్వారా రాలేదని చెప్పాలి.

2017 లో ప్రారంభమైన ఈ సీరియల్ గత సోమవారంతో ముగిసింది. ఈ సీరియల్ దాదాపు 1569 ఎపిసోడ్లను పూర్తి చేసుకుంది.ఈ సీరియల్ ముగియడంతో ఎంతోమంది అభిమానులు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సీరియల్ క్లైమాక్స్ లో మళ్ళీ కలుద్దాం అంటూ కార్తీకదీపం 2 సీరియల్ కి హింట్ ఇవ్వడంతో అభిమానులు ఈ సీరియల్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇకపోతే 2017 వ సంవత్సరం నుంచి ఈ సీరియల్ లో నటిస్తున్న వంటలక్క డాక్టర్ బాబు ఈ సీరియల్ ద్వారా ఎంత మొత్తంలో సంపాదించారు అనే విషయం గురించి ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

డాక్టర్ బాబు వంటలక్కకు ఉన్న క్రేజ్ దృష్టిలో పెట్టుకొని వీరికి రెమ్యూనరేషన్ అందించేవారు. ఈ క్రమంలోనే ప్రేమి విశ్వనాథ్ వంటలక్క పాత్రలో నటిస్తూ ఎంతోమంది అభిమానులను సంపాదించుకోవడంతో ఈమెకు ఒక రోజుకు 25వేల రూపాయల రెమ్యూనరేషన్ చెల్లించేవారు. అలాగే డాక్టర్ బాబుకు రోజుకు 30 వేల రూపాయల రెమ్యూనరేషన్ అందించేవారు. ఇలా 1569 ఎపిసోడ్లకు గాను వీరు ఈ స్థాయిలో రెమ్యూనరేషన్ తీసుకున్నారు అంటే ఈ సీరియల్ ద్వారా కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అందుకొని ఉంటారని చెప్పాలి.