బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నటువంటి కార్తీకదీపం సీరియల్ నేటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగింది అనే విషయాన్ని వస్తే..చారుశీల దీపకు టెస్టులు చేస్తుండగా మీరు కూడా టెస్టు చేయించుకోండి డాక్టర్ బాబు అంటూ మాట్లాడుతుంది. దాంతో కార్తీక్ నేను ప్రతిరోజు చేయించుకుంటాను అని అబద్ధం చెబుతాడు. ఇలా దీప కార్తీక్ ఇద్దరు మాట్లాడుతూ ఉంటారు. ఇక దీప మాట్లాడుతూ మీరిద్దరూ నాకోసమే పుట్టారేమో అని అనడంతో చారుశీల నువ్వు ఇంత తొందరగా నా మాయలో పడతావని అనుకోలేదు అంటూ సంతోషపడుతుంది.
దీపకు మరో స్కానింగ్ చేయాలని చారుశీల లోపలికి తీసుకెళ్తుంది తిరిగి వచ్చి ఒకసారి మందులు చూడమంటే నువ్వు చూసావు కదా ఇంకేం పర్లేదని చెప్పి కార్తీక్ చెప్పగా నువ్వు చూడవు చూసిన ఇందులో అన్ని కరెక్ట్ ఉంటాయి. ఇవ్వాల్సిన మందులన్నీ పండరీచేత ఇప్పిస్తున్నాను కదా అంటూ చారుశీల మనసులో నవ్వుకుంటుంది.మరోవైపు సౌందర్య హిమ గురించి వెతుకుతూ సౌర్యని అడగడంతో నాకు తెలియదు నాన్నమ్మ తనతో మాట్లాడమని నాకు చెప్పొద్దు నువ్వు మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇదే మాట్లాడుతున్న ఇలా చెప్తే నేను ఎక్కడికైనా వెళ్ళిపోతాను అంటుంది.
ఇలా సౌర్య హిమను తప్పు పడుతూ మాట్లాడటంతో సౌందర్య శౌర్యను కోప్పడుతుంది.మరోవైపు సౌందర్య హేమచంద్ర ఇంటికి వెళ్లి మీరు కూడా డాక్టర్ అయినట్టు కదా మా బాబు కూడా డాక్టర్ తనని ఎక్కడైనా చూసారా అంటూ సౌందర్య తన ఫోన్లో ఉన్నటువంటి దీప కార్తిక్ ఫోటోలను చూపించడంతో హేమచంద్ర షాక్ అవుతాడు. అంటే మీరు కార్తీక్ వాళ్ళ అమ్మగారు అని మనసులో అనుకుంటాడు. అయితే తాను చూడలేదని చెప్పడంతో సౌందర్య బాధగా వెళుతుంది కూర్చోండి కాఫీ తీసుకువస్తానని హేమచంద్ర చెప్పగా అంతలోనే దీప ఫోన్ చేసి అన్నయ్య మేము మీ ఇంటికి వస్తున్నాము 10 నిమిషాల్లో అక్కడ ఉంటామని చెబుతుంది.
దీప ఫోన్ చేసేసరికి ఏదైనా జరిగని ఆ తల్లి కొడుకులని ఇలా కలపాలని భగవంతుడు రాసి పెట్టాడేమో అని హేమచంద్ర అనుకుంటాడు. ఇక హేమచంద్ర ఇంట్లో సౌందర్య కాఫీ చూసుకో రావడానికి వెళ్లగా అంతలోపు కార్తీక్ దీప అక్కడికి వస్తారు వారిని చూసిన ఇంద్రుడు మీరు ఇప్పుడు ఎందుకు ఇక్కడికి వచ్చారు. బయట పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు అని ఇంద్రుడు చెబితే మేము హేమచంద్రన్నయ ఇంటికి వెళ్తామని చెబుతారు.అంతలోపు హేమచంద్ర వచ్చి ఇక్కడ మీ అమ్మగారు ఉన్నారని చెప్పడంతో షాక్ అవుతారు
దీప కార్తీక్ లకు హేమచంద్ర వారిని కలవమని చెబుతాడు అయినప్పటికీ కార్తీక్ మాత్రం వినడు ఇక చాటుగా తన పిల్లలను తన అత్తయ్య వాళ్ళను చూస్తూ బాధపడుతుంటారు అదే సమయంలోనే దీప మీరు వెళ్ళండి డాక్టర్ బాబు వెళ్లి వారికి కనిపించండి. యాక్సిడెంట్ అయిన తర్వాత ఆక్సిడెంట్ లో మీరు మాత్రమే బతికారు అని చెప్పండి అని దీప చెబుతుంది. అదేంటి దీప మరి కొద్ది రోజులలో చనిపోయేది నేను కదా అని కార్తీక్ అనడంతో నాకు అంత తెలుసు డాక్టర్ బాబు మీరు కాదు మరి కొద్ది రోజులలో చనిపోయేది నేనే అంటూ దీప చెప్పడంతో కార్తీక్ షాక్ అవుతాడు.