గన్ ఫైర్… దీప అంటూ లోపలకు పరుగులు పెట్టిన డాక్టర్ బాబు…. కార్తీకదీపం సీరియల్ కు పడిన శుభం కార్డు!

బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నటువంటి కార్తీకదీపం సీరియల్ నేటి ఎపిసోడ్ తో శుభం కార్డు పడనుంది. నేటి ఎపిసోడ్ లో భాగంగా ఈ సీరియల్ లో ఏం జరగబోతుందనే ఆత్రుత ప్రతి ఒక్కరిలోనూ నెలకొంది. అయితే నేటి ఎపిసోడ్లో ఏం జరగబోతోంది ఈ సీరియల్ కి ఎలాంటి క్లైమాక్స్ ఇచ్చారనే విషయం తెలియకపోయినా తాజాగా ఈ సీరియల్ కు సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమోలో భాగంగా ఏం జరిగిందనే విషయానికి వస్తే…

మోనిత హిమకు గన్ గురి పెడుతూ డాక్టర్ బాబునీ తనకిచ్చి పెళ్లి చేయమని అడుగుతుంది.నీకు హిమ కావాలా డాక్టర్ బాబు కావాలా అని అడగడంతో దీపా కంగారు పడి డాక్టర్ బాబుని ఏమి చేయవద్దు నువ్వు తనని పెళ్లి చేసుకో నా కూతురిని వదిలిపెట్టు అని చెబుతుంది దీంతో మోనిత సంతోశంలో ఉండగా మోనిత చేతిలో గన్ దీప తీసుకుని తనకు గురిపెడుతుంది. హిమను సౌందర్య వాళ్లకు ఇచ్చి అందరూ అక్కడ నుంచి కిందికి వెళ్లిపొమ్మని చెప్పడంతో కార్తీక్ పిల్లల్ని తన తల్లిని తీసుకొని కిందకు వెళ్తాడు.

ఇక దీప తనని కాల్చేస్తానని బెదిరించడంతో మోనిత తనని బ్రతిమిలాడుకుంటున్నట్టు నాటకమాడి ఒక బొమ్మ తీసుకొని దీప చేతుల మీదకు విసురుతుంది.అప్పుడే గన్ ఫైర్ అయిన శబ్దం రావడంతో బయట నుంచి కార్తీక్ దీప అంటూ లోపలికి పరుగులు పెడతాడు. ఇంతటితో ఈ ప్రోమో పూర్తి అవుతుంది. అయితే ఎవరు ఎవరిని చంపారనే విషయం తెలియాల్సి ఉంది. మరి నేటి ఎపిసోడ్ తో ఈ సీరియల్ కి శుభం కార్డు పడనుంది. దాదాపుగా 1600 ఎపిసోడ్లు ప్రసారమైన ఈ సీరియల్ ముగియడంతో ఎంతోమంది కాస్త నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు.