హిమకు గన్ గురిపెట్టి బ్లాక్ మెయిల్ చేసిన మోనిత… డాక్టర్ బాబును మోనితకు ఇచ్చిన దీప!

బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నటువంటి కార్తీకదీపం సీరియల్ నేటి ఎపిసోడ్లో భాగంగా ఏం జరిగింది అనే విషయాన్నికి వస్తే…. వారణాసి దీపకు ఫోన్ చేసి మీరు అనుకున్నది నిజమే అక్క ఆ మోనిత హిమను తీసుకొని ఇంట్లోనే ఉందని చెప్పడంతో సరే వారనాసి నువ్వు అక్కడే ఉండు మేము వచ్చేస్తున్నామని చెప్పి దీప ఫోన్ కట్ చేస్తుంది. ఇక కార్తీక్ దీప ఒకె కారులో వెళ్ళగా సౌందర్య శౌర్య మరొక కారులో వెళ్తారు. కారులో వెళుతూ ఉండగా దీప కంగారు పడుతూ ఉంటుంది. నువ్వేం కంగారు పడకు హిమను క్షేమంగా బయటకు తీసుకువద్దం అని కార్తీక్ చెబుతాడు. మరోవైపు గన్ వైపు చూస్తూ మోనితకు నేను చెప్పిన దానికి ఒప్పుకోకపోతే ఈ హిమను చంపేస్తాను అంటూ మోనిత మాట్లాడుతూ ఉంటుంది.

అంతలోపు హిమ అక్కడికి రావడంతో ఏం చేస్తున్నారు ఆంటీ అనగా మీ నాన్న ఒప్పుకోకపోతే ఏం చేయాలి అని ఆలోచిస్తున్నాను అని చెప్పడంతో అదేంటి మా నాన్న ఒప్పుకుంటారని మీరే కదా చెప్పారు అని హిమ మాట్లాడుతుంది.ఇక హిమకు ఏదో ఒకటి సర్ది చెప్పి పంపిస్తుంది అంతలోపే కార్తీక్ దీప అక్కడికి వెళ్లి మోనిత ముందు నువ్వు బయటకు రావే అనడంతో.. మోనిత హిమకు గురిపెట్టి దగ్గరకు వస్తే హిమను కాల్చేస్తాను. నువ్వు ఎలాగో పోతున్నావు నీ భర్తను నా చేతిలో పెట్టి వెళ్ళు నీకు భర్త కావాలా కూతురు కావాలా అంటూ తనని బ్లాక్మెయిల్ చేస్తుంది. ఇలా హిమకు గన్ గురి పెట్టడంతో అందరూ షాక్ అవుతారు.

దీంతో దీప కంగారు పడి నా బిడ్డను ఏమీ చేయకు నేను బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నాను. నేను పోయిన తర్వాత నా కుటుంబాన్ని డాక్టర్ బాబును బాగా చూసుకునే వాళ్ళు కావాలనుకున్నాను అయితే నీ కన్నా బాగా చూసుకునే వాళ్ళు ఎవరూ లేరని, డాక్టర్ బాబును ఇచ్చేయాలని నిర్ణయం తీసుకున్నాను అంటూ దీప మాట్లాడుతుంది. ఇలా దీప షాకింగ్ నిర్ణయం తీసుకోవడంతో సౌందర్య కార్తీక్ ఒక్కసారిగా షాక్ అవుతారు. అవును అత్తయ్య నేను బాగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాను డాక్టర్ బాబును మోనితకు ఇచ్చేస్తాను అని చెబుతుంది.

ఈ విధంగా దీప నుంచి ఇలాంటి మాటలు ఊహించకపోవడంతో మోనిత ఇదంతా నిజమేనా నిజంగానే ఇలా మాట్లాడుతున్నావా అని సంతోషపడుతుంది. అవును అంటూ మోనిత దగ్గరకు వెళ్లి తన చేతిలో ఉన్న గన్ లాక్కొని మోనితకు గురి పెట్టి కదిలావంటే కాల్చి చంపేస్తా.. అంటూ దీప మోనితను బెదిరిస్తుంది ఇంతటితో ఈ ఎపిసోడ్ పూర్తి అవుతుంది.