సొంతూరిలో చిన్నపిల్లగా మారి అల్లరి చేస్తున్న తులసి… డబ్బు కోసం కక్కుర్తి పడ్డ లాస్య!

బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ నేడు ఎంతో ఆసక్తికరంగా మారింది నేటి ఎపిసోడ్లో భాగంగా ఈ సీరియల్ లో ఏం జరిగింది అనే విషయాన్ని వస్తే…తులసి తన సొంత ఊరికి వెళ్లాలని కోరిక కోరుకొని ముడుపు కట్టిన విషయం మనకు తెలిసిందే అది చదివిన సామ్రాట్ ఆ కోరిక తీర్చే బాధ్యత తనదేనని భావించి తనకు ఏమీ తెలియనట్టు తులసి చిన్నప్పటి ఊరికి తీసుకువెళ్తారు. కచ్చితంగా ఆ ఊరు బోర్డు ఉన్నచోట కారు చెడిపోయిందంటూ డ్రామాలు ఆడుతారు.

ఇలా కారు చెడిపోయిందని సామ్రాట్ ఏదో చూస్తూ ఉండగా అక్కడే ఉన్నటువంటి బోర్డు చూసి తులసి ఎంతో ఎమోషనల్ అవుతుంది. ఇది తన చిన్నప్పటి ఊరు అని చెప్పడంతో అవునా అంటూ సామ్రాట్ ఏమీ తెలియనట్టు మాట్లాడతారు.నాకు ఈ ఊరిలోనే ఉండి కాసేపు సరదాగా గడపాలని ఉంది అనడంతో సామ్రాట్ మరి ఎందుకు ఆలస్యం ఇక్కడే ఉండి మీ ఊరిని మొత్తం నాకు చూపించు అంటూ చెబుతాడు. తులసి తన చిన్నప్పటి ఊరికి రావడంతో ఎంతో సంతోష పడగా అది చూస్తున్న సామ్రాట్ ఒక వ్యక్తికి తీరని కోరిక తీరితే ఇంత ఆనందంగా ఉంటుందా అని మనసులో అనుకుంటాడు.

ఇలా తులసి తన చిన్నప్పటి ఊరిలో పంట పొలాల మధ్య తిరుగుతూ సరదాగా గడుపుతుంది.మరోవైపు అంకిత కోసం ఇద్దరు పేషెంట్లు తన ఇంటికి వచ్చి డాక్టరమ్మను పిలవమని లాస్యకు చెబుతారు. లాస్య మాత్రం తాను పిలవనని చెబుతుంది.చాలా అవసరం ఉంది డాక్టర్ గారిని పిలవండి అంటూ పేషెంట్స్ చెప్పడంతో తనకు 500 ఇస్తే పిలుస్తానని లాస్య చెబుతుంది. తమ దగ్గర డబ్బు లేవని చెప్పడంతో డబ్బులు లేనప్పుడు జబ్బులు ఎందుకు తెచ్చుకోవడం అంటూ వారిని చిదరించుకుంటుంది.ఇక ఆ ఇద్దరు పేషెంట్స్ వారి దగ్గర ఉన్న చిల్లర మొత్తం తీసి లాస్యకు ఇవ్వగా సరే ఇక్కడే కూర్చోండి పిలుస్తాను డాక్టర్ ను అంటూ ఇంట్లో నేలపై కూర్చోబెడుతుంది.

మరోవైపు తులసి చిన్నప్పుడు తాను వీరయ్య తోటలో మామిడి పండ్లు దొంగతనం చేసిన విషయాన్ని గుర్తు చేసుకుంటుంది.అంతలోగా అక్కడికి వీరయ్య తాత రావడంతో నేను చిన్నప్పుడు నీ తోటలో మామిడి పండ్లు దొంగతనం చేసిన తులసి అని చెప్పడమే కాకుండా చిన్నప్పుడు మామిడి పండ్లు దొంగతనం చేసిన వాటికి ఇప్పుడు డబ్బులు తిరిగి చెల్లిస్తుంది.ఇలా తన సొంతూరులో ఎంతో సరదాగా గడుపుతున్నటువంటి తులసి తిరిగి వేరే చోటకు కారులో వెళుతుండగా కారుకు అడ్డంగా కొందరు ఆడవాళ్లు నిలబడి ఉంటారు. అయితే వాళ్ళు తులసి స్నేహితులు కావడం విశేషం.ఈ క్రమంలోనే తులసి సామ్రాట్ ఇద్దరు కారులో వెళ్లడంతో వారు కూడా తులసి ప్రేమించి పెళ్లి చేసుకుంది కదా తన భర్త చాలా బాగున్నాడు అంటూ సామ్రాట్ తులసి భర్త అని భావిస్తూ ఉంటారు. ఇంతటితో ఈ ఎపిసోడ్ పూర్తి అవుతుంది.