లాస్ట్ ఎపిసోడ్ లో అనసూయకి తప్పని తిప్పలు.. ?

బుల్లితెర గ్లామరస్ యాంకర్ అనసూయ గురించి ఆమె యాంకరింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎన్నో ఏళ్లుగా యాంకర్ గా ఇండస్ట్రీలో కొనసాగుతున్న అనసూయ తన యాంకరింగ్ తో పాటు తన గ్లామర్ తో కూడా బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. జబర్దస్త్ ద్వారా బుల్లితెర యాంకర్ గా బాగా గుర్తింపు పొందిన అనసూయ 9 సంవత్సరాలుగా జబర్దస్త్ ద్వారా ప్రేక్షకులను అలరించింది. అంతేకాకుండా బుల్లితెర మీద ప్రసారమైన ఎన్నో టీవీ షోస్ లో అనసూయ యాంకర్ గా వ్యవహరించింది. ఇలా యాంకర్ గా మంచి గుర్తింపు పొందిన తర్వాత అనసూయ సినిమాలలో నటించే అవకాశాలను కూడా దక్కించుకుంది.

బుల్లితెర మీద పొట్టి పొట్టి బట్టలు వేసుకుని ఎంతో గ్లామరస్ గా కనిపించే అనసూయ సినిమాలలో మాత్రం వైవిధ్యమైన పాత్రలలో నటిస్తూ మంచి గుర్తింపు పొందింది. టీవీ షోస్ కోసం వేసుకొనే బట్టలలో ఫోటోషూట్ చేయించుకునే అనసూయ వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. అయితే అనసూయ బట్టల విషయంలో ఎన్నో సందర్భాలలో విమర్శలు కూడా ఎదుర్కొంది. అయినప్పటికీ అనసూయ మాత్రం తన డ్రెస్సింగ్ గురించి ఎవరు తప్పుగా కామెంట్ చేసినా కూడా వారి మీద విరుచుకుపడుతూ ఉంటుంది. ఇటీవల సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు గారు కూడా అనసూయ డ్రెస్సింగ్ గురించి కామెంట్ చేస్తూ అనసూయ అందంగా ఉంది ఇలా పొట్టి బట్టలు వేసుకోకపోయినా ఆమెను అందరూ చూస్తారు అని చెప్పుకొచ్చాడు. దీంతో అనసూయ ఆయన వయసుకి కూడా గౌరవం ఇవ్వకుండా అతని మీద ఫుల్ ఫైర్ అయ్యింది.

ఇదిలా ఉండగా ఇటీవల అనసూయ సోషల్ మీడియాలో షేర్ చేసిన కొన్ని ఫోటోలు చూసి నేటిజన్స్ షాక్ అవుతున్నారు. ఎప్పుడు స్కిన్ షో చేస్తూ గ్లామరస్ గా ఉండే అనసూయ ఇటీవల ప్రసారమైన జబర్దస్త్ ఎపిసోడ్ లో మాత్రం నిండుగా చీర కట్టుకొని ఎటువంటి స్కిన్ షో చేయకుండా చాలా పద్ధతిగా కనిపించింది. ఈ ఫోటోలను అనసూయ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ జబర్దస్త్ ని వీడనున్న విషయం చెప్పుకొచ్చింది. అయితే అనసూయ ఫోటోలు చూసిన కొంతమంది నేటిజన్స్ ఇంతకాలం ఎంతమంది చెప్పినా మారని అనసూయ జబర్దస్త్ చివరి ఎపిసోడ్ లో మాత్రం చాలా పద్ధతిగా తయారై వచ్చింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాకుండా ఇటీవల పలు టీవీ షోస్ కి యాంకర్ గా వ్యవహరిస్తున్నాను ఈమె అక్కడ కూడా చాలా పద్ధతిగా దుస్తులు ధరిస్తోంది. దీంతో ఎంతమంది చెప్పిన మారని అనసూయ తనంతట తాను తెలుసుకొని ఇప్పుడు కొంచం పద్దతిగా తయారవుతోంది. ఇదిలా ఉండగా ఇక ఇప్పటినుండి అనసూయ జబర్దస్త్ షోలో కనిపించకపోవడంతో ఎంతోమంది అభిమానులు ఆమెను చాలా మిస్ అవుతున్నారు.