రష్మి కి రెమ్యునరేషన్ ఇవ్వాలంటే అలాంటి ఫంక్షన్ చేయాలి… హైపర్ ఆది కామెంట్స్ వైరల్!

హైపర్ ఆది గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. జబర్థస్త్ షో ద్వారా కమెడియన్ గా గుర్తింపు పొందిన ఆది బుల్లితెర మెగాస్టార్ గా గుర్తింపు పొందాడు. అయితే కొంత కాలం జబర్దస్త్ కి దూరమైన ఆది ఇటీవల మల్లి జబర్దస్త్ లో తన సందడి మొదలు పెట్టాడు. ఇక అది ఎంట్రీ ఇవ్వటంతో జబర్దస్త్ రేటింగ్స్ కూడా అమాంతం పెరిగిపోయాయి. ఈ మధ్యకాలంలో ఒక టీమ్ మెంబర్స్ మాత్రమే కాకుండా రెండు టీములు ఒక్కొక్క బ్యాచ్ గా ఏర్పడి జబర్దస్త్ లో స్కిట్స్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.

ఇక ఈ వారం ప్రసారం కాబోయే జబర్దస్త్ ఎపిసోడ్ లో కూడా ఆది తన టీమ్ మెంబర్స్ తో పాటు బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్ మెంబర్స్ కలిసి స్కిట్ చేశారు. ఈ క్రమంలో బుల్లెట్ భాస్కర్, రాకేష్, ఇమాన్యుల్ తో మరి కొంతమంది క్రికెట్ టీం గా ఏర్పడి స్టేజ్ పైకి వచ్చి సందడి చేశారు. వచ్చి రాగానే బుల్లెట్ భాస్కర్ సెట్ లో ఉన్న అందరిని కాళీ చేయమని చెప్పగా ఇమాన్యుల్ కల్పించుకొని అందరూ బయటకు వెళ్ళింది వెళ్ళండి మా అన్న క్లీన్ చేసిన తర్వాత రండి అంటూ భాస్కర్ పరువు తీశాడు.

ఇక ఈ క్రమంలో అది కూడా కొంతమందితో కలిసి హాకీ టీం గా ఏర్పడి స్టేజ్ పైకి వచ్చారు. ఇక అది ఆపోజిట్ దీనిలో ఉన్న బుల్లెట్ భాస్కర్ అండ్ టీం మీద తనదైన శైలిలో పంచులు వేస్తూ రెచ్చిపోయాడు. అంతేకాకుండా తన టీమ్ లో ఉన్న వారి మీద కూడా ఆది పంచులు వేశాడు. ఈ మేరకు బుల్లెట్ భాస్కర్ మాట్లాడుతూ ఇక్కడ ఉండకూడదు పద రష్మీ అంటూ గొప్పలు చెప్పాడు. భాస్కర్ అలా అనగానే అది మాట్లాడుతూ రేష్మి రెమ్యూనరేషన్ ఇవ్వాలంటే నువ్వు 100 పెద్దమనిషి ఫంక్షన్లు చేయాలి అంటూ భాస్కర్ పరువు తీశాడు. మొత్తానికి ఆది, బుల్లెట్ భాస్కర్ ఇద్దరూ ఈవారం తమ పర్ఫామెన్స్ తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యారు.