బుల్లితెర మీద ప్రసారం అవుతున్న జబర్దస్త్ కామెడీ షో గత తొమ్మిది సంవత్సరాలుగా నిర్విఘ్నంగా ప్రసారం అవుతూ ప్రేక్షకులను అల్లరిస్తోంది. అయితే కొంతకాలంగా జబర్థస్త్ నుండి వలసలు మొదలయ్యాయి. జబర్థస్త్ ద్వార ఎంతోమంది కమెడియన్లుగా మంచి గుర్తింపు పొందారు. ఇలా జబర్దస్త్ ద్వారా గుర్తింపు పొందిన చాలామంది కమెడియన్లు ఇప్పుడు జబర్దస్త్ కి దూరమయ్యారు. అంతే కాకుండా వారు బయటికీ వెళ్ళిన తర్వాత జబర్థస్త్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక ఈ షో ద్వారా గుర్తింపు పొందిన కమెడియన్లు మాత్రమే కాకుండా యాంకర్, జడ్జ్ లు కూడా జబర్థస్త్ కి దూరమయ్యారు.
జబర్థస్త్ ప్రారంభమైన నాటి నుండి నాగబాబు, రోజా జడ్జ్ లుగా వ్యవహరిస్తూ సందడి చేశారు. కొంత కాలం తర్వాత మల్లెమల వారితో వచ్చిన మనస్పర్ధలు కారణంగా నాగబాబు జబర్దస్త్ కి దూరమయ్యాడు. ఆ సమయంలో నాగబాబుతోపాటు చమ్మక్ చంద్ర కిర్రాక్ ఆర్పీ వంటి వారు జబర్దస్త్ కి దూరమయ్యారు. అయినప్పటికీ రోజా జడ్జ్ గా కొనసాగుతోంది. ఇక నాగబాబు స్థానంలో సింగర్ మనో కొంతకాలం జడ్జ్ గా వ్యవహరించాడు. అయితే మనో ఇతర షోలతో బిజీగా ఉండటం వల్ల జబర్థస్త్ లో కంటిన్యూ గా కొనసాగలేకపోయాడు. అప్పటినుండి ఎవరు వచ్చినా కూడా కొంతకాలం మాత్రమే ఉంటున్నారు.
ఇక ఇటీవల మంత్రి పదవి దక్కటంతో రోజా కూడా జబర్థస్త్ కి దూరమయ్యింది. దీంతో ఆమె స్థానంలో హీరోయిన్ ఇంద్రజ కొనసాగుతోంది. ఇక ఇప్పుడు జబర్థస్త్ కి మరొక కొత్త జడ్జ్ వచ్చారు. ఆయన ఎవరోకాదు సీనియర్ కమెడియన్ కృష్ణ భగవాన్. కమెడియన్ గా మంచి గుర్తింపు పొందిన కృష్ణ భగవాన్ ఈ వారం ప్రసారం కాబోయే జబర్దస్త్ ఎపిసోడ్ లో జడ్జిగా వ్యవహరించనున్నాడు. ఇటీవల ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో విడుదల అయింది. ఈ ఎపిసోడ్ లో ఆయన వేసే పంచులు ఎపిసోడ్ పై ఆసక్తిని పెంచాయి. కృష్ణ భగవాన్ రాకతో జబర్థస్త్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇంత కాలానికి సరైన జడ్జ్ ని తీసుకువచ్చారని వారి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి కృష్ణ భగవాన్ రాకతో జబర్థస్త్ కి మునుపటి వైభవం రానుందా? లేదా? అన్నది చూడాలి మరి.