వారిని ఎలాగైనా ఐపీఎస్ చదివించాలని పట్టుబట్టిన రామ.. కండిషన్ పెట్టిన జానకి!

కుటుంబ విలువలను తెలియజేస్తూ బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు సీరియల్ ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంది. ఈ సీరియల్ నేడు మరింత ఆసక్తికరంగా మారింది. గుడిలో మల్లిక చేత లక్షపత్రి హోమం చేయించమని జ్ఞానంభ చెబుతుంది. అయితే ఆ పూజ చికిత చేత చేయించి మమ అనుకుంటానని బ్రతిమలాడుతుండగా వెంటనే గోవిందరాజులు వెళ్లి మల్లిక చేత ఆ పూజ చేయిస్తారు.మరోవైపు ఎలాగైనా జానకి గారిని ఐపీఎస్ చదివించాలని రామ దేవుడి ముందు చేతిలో కర్పూర హారతి వెలిగించి నిలబడతారు.

ఇది చూసిన జానకి వెళ్లి అక్కడికి ఆహారతి విసిరి కొడతారు.మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు అంటూ అడగగా మీరు చదువుకోవడమే నాకు ముఖ్యమని రామా చెబుతాడు దాంతో తాను చదువుకోనని కేవలం మీకు మంచి భార్యగా మంచి ఇల్లాలుగా ఉంటానని చెబుతుంది.అప్పుడు చివరి క్షణంలో జానకి తండ్రి తన చేతికి ఇచ్చిన పెన్ చూపించి ఇది ఆరోజు నా చేతిలో ఎందుకు పడిందో నాకు అర్థం కాలేదు కానీ ఇది ఆయన ఇచ్చిన పెన్ మాత్రమే కాదు ఆయన కల నెరవేర్చ బాధ్యత కూడా నాకే ఇచ్చారని రామ చెబుతాడు. ఆ పెన్ చూసి జానకి కూడా ఎమోషనల్ అవుతుంది.

జానకి మాట్లాడుతూ నేను చేసింది తప్పు కాదు ఐపీఎస్ అయిన తర్వాత తప్పు చేసింది భర్త అయినా కూడా ఎదురుగా నిలబడి పోరాడాలి అనుకుంటేనే ఐపీఎస్ కావాలి లేదా ఏదో ఒకటి వదులుకోవాలి అందుకే తాను తన కుటుంబం కోసం తన కలను వదులుకున్నానని జానకి చెబుతుంది. నేను ఐపీఎస్ అయితే అందరి కల నెరవేరుతుంది. కానీ సొసైటీకి న్యాయం చేయలేనప్పుడు నేను ద్రోహాన్ని చేసిన దానినవుతా అందుకే నాకు నా కుటుంబమే కావాలి అని చెబుతుంది.నేను మీ భార్యగా మీరు ఏం చెప్తే అది వింటానని జానకి చెప్పడంతో అయితే భర్తగా నా మాట వినండి నా కోరిక తీర్చండి. మీరు ఐపీఎస్ కావాలి అని పట్టుబడతారు.

మరోవైపు మాధురి పరిస్థితి చాలా క్రిటికల్ గా ఉందని డాక్టర్లు చెప్పడంతో అది విన్నటువంటి ఆమె తల్లిదండ్రులు బాధపడుతూ ఉంటారు. ఇక అఖిల్ అందరి ముందు మంచిగా నటిస్తూ లోలోపల తన స్వభావాన్ని చూపిస్తూ ఉంటారు.మరుసటి రోజు ఉదయం జానకి తులసి కోట వద్ద ఆకాశదీపం పెడుతుండగా రామ అక్కడికి వెళ్లి మీరు ఏ నిర్ణయం తీసుకున్నారు అంటూ అడగడంతో జానకి నేను ఐపీఎస్ చదవాలంటే కొన్ని కండిషన్లు కూడా ఉంటాయి. అని చెబుతూ రేపొద్దున నేను ఐపీఎస్ అయ్యాక కూడా ఇలాంటి సమస్య ఎదురైతే నేనేం చేయాలి. నిజాయితీ గల ఇల్లాలిగా ఉండాలా లేకపోతే బాధ్యతగల పోలీస్ ఆఫీసర్ గా ఉండాలా మీరే చెప్పండి అంటూ ప్రశ్నిస్తుంది. దాంతో రామ బాగా చదువుకున్న వాళ్లతో వచ్చిన సమస్య ఇది అంటూ ఎలాగైనా మిమ్మల్ని చదివిస్తానని పట్టుబడతారు.