జబర్దస్త్ యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అనసూయ ప్రస్తుతం ఈ కార్యక్రమానికి దూరమై తన సినిమా అవకాశాలను అందుకుంటూ సినిమాలలోను వెబ్ సిరీస్ లలో నటిస్తూ బిజీగా ఉన్నారు.జబర్దస్త్ కార్యక్రమానికి యాంకర్ గా దూరమైనప్పటికీ ఇతర కార్యక్రమాలలో యాంకర్ గా వ్యవహరిస్తూ బిజీగా ఉన్నారు. ఇలా వరుస సినిమాలో షూటింగులతో ఎంతో బిజీగా ఉన్న అనసూయ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటూ నిత్యం తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు.
ఇదిలా ఉండగా తాజాగా సోషల్ మీడియా వేదికగా తెలంగాణ మంత్రి కేటీఆర్ ఒక పోస్ట్ చేశారు. గుజరాత్ బిల్కిన్ బానో సామూహిక అత్యాచారం కేసులో జైలుకు వెళ్లిన దోషులు విడుదలయ్యాక వారికి ఒక సంస్థ సన్మానం చేయడంతో మంత్రి తనదైన స్టైల్ లో వారిపై కౌంటర్ వేస్తూ ట్వీట్ చేశారు. ఇక ఈ ట్వీట్ పై అనసూయ స్పందిస్తూ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఈ క్రమంలోనే ఎంతోమంది నెటిజన్లు అనసూయ రిప్లై ఇవ్వడంతో ఆమెను టార్గెట్ చేస్తూ కామెంట్లు చేస్తున్నారు.అప్పట్లో హైదరాబాదులో ఒక మైనర్ బాలికపై అత్యాచారం జరిగినప్పుడు నువ్వెందుకు మౌనంగా ఉన్నావు అంటూ ఈమెపై పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు.
ఇలా అనసూయకి ట్విట్టర్ వేదికగా ఈ విషయంపై ఇలాంటి కామెంట్స్ రావడంతో ఈమె స్పందిస్తూ నేను ఎలాంటి కామెంట్ చేసినా ట్వీట్ చేసిన అది పూర్తిగా నా వ్యక్తిగత అభిప్రాయం తప్ప ఎవరిని ఉద్దేశించి ఎవరిని ప్రమోట్ చేస్తూ చేయలేదని తెలిపారు.. మీరు అలాంటి ఉద్దేశంలో ఉన్నప్పుడు రాజకీయాలపై ట్వీట్స్ చేయడం మానుకోనీ ముందు మీరు ఆర్టిస్ట్ అని ఒప్పుకోండి అంటూ మరికొందరు కామెంట్లు చేయగా .. ఈ వ్యాఖ్యలపై స్పందించిన అనసూయ దయచేసి నన్ను రాజకీయాలలోకి లాగ వద్దని నేను నటిగా కన్నా ముందు ఓ మనిషిని, ఒక స్త్రీని ఆ తర్వాతే మిగతావన్నీ అంటూ ఘాటుగా స్పందిస్తూ నెటిజన్లకి కౌంటర్ ఇచ్చారు.