తులసి లేనిలోటు తెలుసుకున్న నందు… రెస్టారెంట్ వారితో గొడవపడ్డ నందగోపాల్!

బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ నేటి ఎపిసోడ్లో ఏం జరిగిందనే విషయాన్ని వస్తే.. బయట ఏదో పాట వినపడితే సరస్వతి తులసి ఇద్దరు బయటకు పరిగెడతారు అక్కడ వాక్ మెన్ లో పాట రావడం చూసి ఎంతో సంతోషపడతారు.ఇది ఇక్కడికి ఎలా వచ్చింది అంటూ ఆలోచిస్తూ ఉండగా అంతలో సామ్రాట్ వచ్చి దానంతట అదే రాదు అంటాడు. తనకు ఎంతో ఇష్టమైన వాక్ మెన్ తెచ్చి ఇచ్చినందుకు సరస్వతి తనకు కృతజ్ఞతలు తెలుపుతుంది.

ఇక తులసి కూడా సామ్రాట్ కి కృతజ్ఞతలు తెలుపుతుంది. ఇక అందరూ కలిసి కాఫీ తాగుతుంటారు మరోవైపు ఇంటర్వ్యూకి వెళ్లి నందుకు జాబ్ రాకపోవడంతో బాధపడుతూ ఉండగా అంతలోపు లాస్య వచ్చి ఇంటర్వ్యూకి వెళ్ళావు కదా ఏమైంది నందు అని అడగడంతో జాబ్ వస్తే నేనెందుకు ఇలా ఉంటాను అని నందు మాట్లాడతాడు.నీ జాబ్ గురించి మాట్లాడను కానీ ఇంటి గురించి మాట్లాడవచ్చా అంటూ లాస్య అనడంతో కంప్లైంట్స్ తప్ప వేరే ఏమైనా మాట్లాడు అని నందు చెబుతాడు.

దీంతో లాస్య ఇంట్లో కరెంట్ బిల్లు కట్టాలి ఇంటర్నెట్ బిల్ కట్టాలి, ప్రాపర్టీ టాక్స్ కట్టాలి అని చెబుతూ అన్ని బిల్స్ నందుకు ఇస్తుంది.ఇవన్నీ ఇప్పుడు నేను కట్టలేను నాకు జాబ్ లేదని నీకు తెలుసు కదా ఈ విషయాలు ప్రేమ్ లేదా అభికి చెప్పచ్చు కదా అని నందు చెబుతాడు.వారికి నేనెలా చెప్పగలను అని లాస్య చెప్పడంతో నాకు జాబ్ వచ్చేవరకు వీటన్నింటినీ ఎలాగోలాగా నువ్వే మెయింటెన్స్ చేయి అని చెప్పి వెళ్తాడు.మరోవైపు తులసి సామ్రాట్ ఇద్దరు కూడా ఆఫీసు పనిలో బిజీగా ఉంటారు. ఇక తులసికి అంత మంచి గిఫ్ట్ ఇచ్చినందుకు మరోసారి థాంక్స్ చెప్తుంది. ఒట్టి థాంక్స్ మాత్రమేనా రిటర్న్ గిఫ్ట్ లేదా పార్టీ లాంటిది అని అడగడంతో మధ్యాహ్నం లంచ్ కి వెళ్దామని తులసి చెబుతుంది.

మరోవైపు పరంధామయ్య అనసూయమ్మ మాట్లాడుతూ టాబ్లెట్స్ అయిపోయాయి ఈ విషయం నందు కి చెబుతాము అంటే తనకు జాబ్ లేదు తను కూడా ఎక్కడినుంచి తెస్తాడు అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ మాటలన్నీ కూడా నందు వింటూ ఉంటాడు.నందుకి కాకపోయినా అభి లేదా ప్రేమ్ కి చెబితే తెస్తారు కదా అని అనసూయమ్మ చెప్పడంతో వాళ్ళు తెస్తారు ఎవరి దగ్గర ఒకరి దగ్గర అప్పుచేసి తీసుకొస్తారు దాని కోసం వాళ్ళు ఎంత కష్టపడతారని పరంధామయ్య అంటాడు. రోజు ఆ టాబ్లెట్స్ బాక్స్ ఇక్కడికి తీసుకురా.. కానీ మనం టాబ్లెట్స్ వేసుకోకుండా ఉంటే మందులు అయిపోవు కదా అని పరంధామయ్య చెప్పడంతో నందగోపాల్ తులసి దగ్గరే అమ్మ నాన్నలను కొద్దిరోజులు ఉంచాల్సింది వారిని నా దగ్గరకు తీసుకువచ్చి కనీసం మందులు కూడా తెప్పించలేక వారిని బాధపెడుతున్నాను అని మనసులో అనుకుంటాడు.

ఇంతలోనే మందులు కొరియర్ రావడంతో అది ఓపెన్ చేసి చూసిన నందు తులసి మందులు పంపించిందని తెలుసుకొని నీ విలువెంటో నీవు లేని లోటు ఏంటో తెలుస్తుంది తులసి అనుకొని మందుల కవర్ తన తల్లిదండ్రుల చేతిలో పెడతారు. మాకు మందులు అయిపోయాయని నీకెలా తెలుసు అంటూ పరంధామయ్య అడగడంతో మన మనసులు ముందుగానే నందు ఊహించాడని అనసూయ మాట్లాడుతుంది. దీంతో తులసి కూడా అంతే మనకి ఎప్పుడు మందులు అయిపోతాయా అని ముందుగానే గ్రహించి తెప్పిస్తుందని అనసూయ చెప్పడంతో ఆ మందులు కూడా తులసినే పంపించిందని చెప్పినందు గోపాల్ అక్కడ నుంచి వెళ్తాడు. రేపటి ఎపిసోడ్లో నందు తులసి సామ్రాట్ ఉన్న రెస్టారెంట్ కి వెళ్లి భోజనం చేస్తాడు అయితే అప్పటికి పర్స్ మిస్ అవ్వడంతో బిల్ కట్టలేదని రెస్టారెంట్ వాళ్ళు నందగోపాల్ తో గొడవపడతారు.