దీపని చూసి షాక్ అయినా సౌందర్య…. చంపేస్తా అంటూ చారుశీలకు వార్నింగ్ ఇచ్చిన మోనిత!

బుల్లితెర ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నటువంటి కార్తీకదీపం సీరియల్ నేటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందనే విషయాన్ని వస్తే.. దీప మోనిత గురించి ఆలోచిస్తూ తన మాటలను గుర్తుచేసుకొని బాధపడుతూ ఉంటుంది. మోనిత ఎంతకైన తెగిస్తుంది. డాక్టర్ బాబు ను సొంతం చేసుకోవడానికి ఏమైనా చేస్తుంది.అని ఆలోచిస్తూ ఉండగా మరోవైపు కార్తీక్ కూడా మోనిత గురించి ఆలోచిస్తూ తను ఇక్కడికి రాకుండా చేయాలి దీపకు మనశ్శాంతి ఉండేలా చేయాలని ఆలోచిస్తూ ఉంటాడు. అంతలోనే దీప గట్టిగా డాక్టర్ బాబు అని అరవడంతో కార్తీక్ కంగారుగా వచ్చి ఏమైందని అడుగుతారు.

మొదటిసారి నాకు మోనితను చూస్తుంటే భయం వేస్తుంది డాక్టర్ బాబు తను ఏం చేయడానికి అయినా సిద్ధపడుతుంది. నిజంగానే నేను చనిపోయిన తర్వాత తను నిన్ను తీసుకొని స్విజర్లాండ్ వెళ్లిపోతే పిల్లల పరిస్థితి ఏంటి అని బాధపడుతుంది. దాంతో కార్తీక్ నీకు ఎన్ని సార్లు చెప్పాను నీకు ఏమీ కాదని ధైర్యం చెబుతాడు. అయితే దీప మాత్రం నాకు మీతో కలిసి బ్రతకాలని ఉంది ఎలాగైనా నన్ను బ్రతికించండి డాక్టర్ బాబు అంటూ ప్రాదయపడుతుంది.

మరోవైపు సౌందర్యం నిద్రలేచి భగవంతుడిని నేను కోరుకునేది ఒకటే నా కొడుకు కోడలు బ్రతికుంటే వారిని నాకు కనిపించేలా చేయమని అంటూ దేవుడిని నమస్కరించుకొని బయటకు వస్తుంది. అయితే అక్కడ దీప ఉండడం చూసిన సౌందర్య షాక్ అవుతుంది.దీప అంటూ వెళ్లి తనని హత్తుకొని ఏడుస్తుంది. ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయావు నీకోసం నీ పిల్లలు ఎలా తిరుగుతున్నారో తెలుసా అనడంతో నాకు అన్ని తెలుసు అత్తయ్య అంటుంది. అన్ని తెలిసిన దూరంగా ఎందుకు ఉన్నారు అని సౌందర్య అడగడంతో నేను ఇక్కడికి వచ్చినట్లు పిల్లలకు తెలియకూడదు. ఇప్పుడు కూడా డాక్టర్ బాబుకు తెలియకుండా నేను మిమ్మల్ని కలవడానికి వచ్చాను త్వరలోనే మీకు అన్ని విషయాలు చెబుతానని వెళ్ళిపోతుంది.

మరోవైపు మోనిత కార్తీక్ ఫోటోలు చూస్తూ కూర్చుంటుంది. అంతలోపే చారుశీల అక్కడికి రావడంతో కార్తీక్ ఎంత అందంగా ఉన్నాడో అంటూ మురిసిపోతుంది.ఇక చారుశీల నువ్వు జైల్లో ఉంటే కార్తీక్ ను ఎలాగైనా నా సొంతం చేసుకోవాలనుకున్నాను ఇప్పుడు తిరిగి వచ్చావు అని మనసులో అనుకోవడంతో మోనిత మాత్రం ఏంటి కార్తీక్ కు గాలం వేస్తున్నావా? తనని నీ సొంతం చేసుకోవాలని చూస్తున్నావా అంటూ అనడంతో చారుశీల షాక్ అవుతుంది.అయితే చారుశీల ఏదో అబద్ధం చెప్పే ప్రయత్నం చేయగా ఇది నీ ఫోన్ కార్తీక్ ఫోటోలు నా దగ్గర కూడా లేనన్ని నీ దగ్గర ఉన్నాయి. కార్తీక్ పై మనసు పడ్డావా…నేనే దీప నుంచి కార్తీక్ ను సొంతం చేసుకోవాలని చూస్తే నువ్వు నా నుంచి లాగేసుకోవాలని చూస్తున్నావా ఇలాగే చేస్తే ప్రాణాలు తీసేస్తే జాగ్రత్త అంటూ తనకు వార్నింగ్ ఇస్తుంది.

మరోవైపు దీప కనిపించకపోవడంతో కార్తీక్ కంగారుపడుతూ తనని వెతుకుతుంటాడు అసలు ఎక్కడికి వెళ్లావు దీప నాకు చెప్పకుండా ఆ మౌనిత దగ్గరకు వెళ్ళావా లేక అమ్మ వాళ్ళ దగ్గరకు వెళ్ళావా అంటూ ఆలోచిస్తూ ఉంటాడు. అదే సమయంలో హిమ సౌర్య ఇద్దరు కూడా తన తల్లిదండ్రులను వెతుకుతూ రోడ్డుపై వెళ్తుంటారు. అయితే చాక్లెట్స్ కొనుక్కుందామని హిమ చెప్పడంతో శౌర్య వద్దు అంటూ గొడవ పడుతుంది. అప్పుడే ఓ దొంగ వాళ్ళ దగ్గర నుంచి డబ్బు లాక్కొని పారిపోతుంటాడు. ఆ సమయంలో హిమ కిందపడబోతూ ఉండగా కార్తీక్ తను పడకుండా పట్టుకుంటాడు దీంతో హిమాసౌర్య కార్తీక్ ని చూసి ఒక్కసారిగా ఎమోషనల్ అయి తనని హత్తుకొని ఏడుస్తారు కార్తీక కూడా తన పిల్లలను అలా చూసేసరికి ఎమోషనల్ అవుతాడు.