కార్తీకదీపం సీరియల్ కు పడిన శుభం కార్డు…. త్వరలోనే ప్రారంభం కానున్న రెండో సీజన్!

బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నటువంటి సీరియల్స్ లో కార్తీకదీపం సీరియల్ ఒకటి.1569 ఎపిసోడ్లను పూర్తి చేసుకున్న ఈ సీరియల్ కు ఎట్టకేలకు శుభం కార్డు పడింది. ఇన్ని రోజులపాటు స్టార్ మా లో అత్యధిక రేటింగ్ కైవసం చేసుకుని ఎన్నోకార్యక్రమాలను వెనక్కి నెట్టిన కార్తీకదీపం సీరియల్ ఈ మధ్యకాలంలో కాస్త సాగదీయడంతో రేటింగ్ కూడా తగ్గింది. దీంతో డైరెక్టర్ ఈ సీరియల్ కి ముగింపు పలికారు. ఈ క్లైమాక్స్ ఎపిసోడ్లో భాగంగా మోనిత చనిపోవడం, సౌర్య తిరిగి పారిపోవడం, దీప కార్తీక్ ఇంటికి వెళ్లకుండా ఉండటం వంటి సన్నివేశాలతో ఈ సీరియల్ క్లైమాక్స్ ను ముగించారు.

ఇక ఈ సీరియల్ క్లైమాక్స్ ముగిసే సమయంలో మళ్లీ కలుద్దాం అంటూ ఈ సీరియల్ రెండవ సీజన్ కు పునాది వేశారు.ఇలా ఈ సీరియల్ ముగిసిందన్న నిరాశలో అభిమానులు ఉన్నప్పటికీ రెండవ సీజన్ రాబోతుందన్న ఆనందంలో కూడా ఉన్నారు. అయితే ఇప్పటికే రెండవ సీజన్ కి సంబంధించిన కొంత షూటింగ్ కూడా పూర్తి అయిందని త్వరలోనే ఈ సీరియల్ రెండవ సీజన్ కూడా ప్రారంభం కాబోతుందనే వార్తలు వస్తున్నాయి. రెండవ సీజన్లో భాగంగా శౌర్యహిమా ఇద్దరూ పెద్ద కావడం వాళ్లు తిరిగి తమ తల్లిదండ్రుల కోసం వెతకడం వంటి కథతో ఈ సీరియల్ ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది.

ఇప్పటికే కొంత భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సీరియల్ మరొక రెండు నెలలలో తిరిగి ప్రారంభం కాబోతుందని సమాచారం.ఇలా కార్తీకదీపం సీరియల్ ద్వారా వంటలక్క డాక్టర్ బాబు ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇకపై వంటలక్క డాక్టర్ బాబు ఇద్దరిని బుల్లితెరపై చూసే అవకాశం లేదని అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్న తరుణంలో కార్తీక దీపం 2 గురించి హింట్ ఇచ్చి తిరిగి అభిమానులలో కొత్త ఆశలు మొదలయ్యాయి. మరి అభిమానులంతా కూడా ఈ సీరియల్ రెండవ భాగం కోసం ఎంతో ఎదురు చూస్తున్నారు.