యాంకర్ అనసూయ పై ఫైర్ అవుతున్న మెగా ఫాన్స్

అనసూయ పరిచయం అవసరం లేని పేరు బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె ఈ మధ్యకాలంలో పెద్ద ఎత్తున నేటిజన్ ల ట్రోలింగ్ కి గురి అవుతుంది.అయితే ఈమె గురించి ఎవరైనా ఎలాంటి విమర్శలు చేసిన తనదైన స్టైల్ లో వారికి లెఫ్ట్ రైట్ ఇస్తుంది.ఇకపోతే బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న అనసూయ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇకపోతే తాజాగా ఈమె మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఇందులో చిరంజీవిని జైలుకు పంపించే రిపోర్టర్ పాత్రలో అనసూయ సందడి చేశారు. ఈమె పాత్రని నీడివి తక్కువ ఉన్నప్పటికీ ఎంతో కీలక పాత్ర కావడంతో అనసూయ పాత్ర అందరిని ఆకట్టుకుంది. ఇలాంటి సినిమాలో ఒక మంచి పాత్రలో నటించిన అనసూయ ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. అయితే అనసూయ ప్రమోషన్ కార్యక్రమాలకు రాకపోవడానికి గల కారణాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. తాను ఇతర సినిమా షూటింగులతో బిజీగా ఉండటంవల్ల ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలకు దూరంగా ఉన్నానని తెలిపారు.

ఈ విధంగా గాడ్ ఫాదర్ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల పట్ల ఈమె చెప్పిన సమాధానం విన్నటువంటి అభిమానులు ఒక్కసారిగా అనసూయ పై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.ఒక స్టార్ హీరో సినిమాలో నటించి అది మంచి స్కోప్ ఉన్న పాత్రలో నటించి ప్రమోషన్ కార్యక్రమాలకు రాకపోతే తన కెరియర్ కిఎలాంటి ప్రయోజనం ఉండదని ఇలాంటి ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొన్నప్పుడే తన కెరీర్ కు మరింత ప్లస్ పాయింట్ అవుతుందని కొందరు అభిమానులు కామెంట్లు చేయగా మరి కొందరు మెగా అభిమానులు మాత్రం నువ్వేమైనా పెద్ద స్టార్ హీరోయిన్ అనుకున్నావా వరుస సినిమాలతో బిజీగా ఉండటానికి అంటూ కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి అనసూయ మరోసారి నేటిజెన్ల ట్రోలింగ్ కి గురవుతోంది.