Star Heroin: సినిమా ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమయంలో సరైన టైమ్ వస్తుందని చెప్పాలి. ఒక సినిమాతో వారి కెరియర్ పూర్తిగా మారిపోతూ ఉంటుంది. ఇలా ఇండస్ట్రీలో ఒకే ఒక హిట్ సినిమాతో స్టార్ సెలెబ్రెటీలుగా మారిపోయిన వారు ఎంతోమంది ఉన్నారు. అయితే ఆ తరువాత వారి కెరియర్ను సరైన విధంగా ప్లాన్ చేసుకుంటేనే ఆ స్టార్డం కొనసాగుతుంది లేదంటే ఇండస్ట్రీకి దూరం కావాల్సిన పరిస్థితుల వస్తాయని చెప్పాలి.
ఇలా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా గ్రాఫ్ పెంచుకుంటూపోతున్న వారిలో నటి రష్మిక మందన్న ఒకరు. కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈమె ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ హీరోయిన్గా మారిపోయారు. ఇక ఇటీవల వరుస బాలీవుడ్ హిట్ సినిమాలతో దూసుకుపోతున్న ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ అవకాశాలు అందుకుంటూ బిజీగా ఉన్నారు.
ఇక ఇటీవల కాలంలో రష్మిక నటించిన సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో కలెక్షన్లను రాబడుతున్నాయి. పుష్ప, యానిమల్ , పుష్ప 2, ఛావా ఇలా వరుస హిట్ సినిమాలలో నటిస్తూ రష్మిక మంచి సక్సెస్ అందుకున్నారు. ఇక ఈమె నటించిన ఈ సినిమాలన్నీ కూడా సుమారు 500 కొట్టకు పైగా కలెక్షన్లను రాబట్టాయి. ఇక పుష్ప 2 సినిమా విషయానికి వస్తే ఈ సినిమా ఏకంగా 1800 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టి సంచలనాలను సృష్టించింది.
ఇక ఇటీవల బాలీవుడ్ ఇండస్ట్రీలో ఈమె నటించిన ఛావా సినిమా కూడా మంచి సక్సెస్ కావడంతో రష్మిక క్రేజ్ మరింత పెరిగిపోయింది. ఈ క్రమంలోని ఈమెకు భారీ అవకాశాలు కూడా వస్తున్నాయని చెప్పాలి ఇలా రష్మిక నటించిన అంటే ఆ సినిమా 500 కోట్లకు పైగా కలెక్షన్లను రాబడుతుంది అంటూ ఈమె హీరోలకు లక్కీ హీరోయిన్ అంటూ దర్శక నిర్మాతలు భావించడమే కాకుండా ఈమెకు భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ కూడా ఇవ్వటానికి నిర్మాతలు సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. ఇక ప్రస్తుతం రష్మిక కుబేర, సికిందర్, వంటి పలు సినిమాల షూటింగ్ పనులలో బిజీగా గడుపుతున్నారు.