Venu Swamy: వేణు స్వామి పరిచయం అవసరం లేని పేరు ఈయన జ్యోతిష్యుడుగా ఇటీవల కాలంలో ఎంతో ఫేమస్ అయ్యారు ముఖ్యంగా సమంత నాగచైతన్య విడాకులు తీసుకుని విడిపోతారని ఈయన చెప్పడంతో అప్పట్లో అందరూ విమర్శలు చేసిన చివరికి ఈయన చెప్పిన విధంగానే పెళ్లైన మూడు సంవత్సరాలకి విడాకులు తీసుకొని విడిపోవడంతో వేణు స్వామి ఒకసారిగా పాపులర్ అయ్యారు. ఇక అప్పటినుంచి వేణు స్వామి పెద్ద ఎత్తున వార్తల్లో నిలబడమే కాకుండా తరచూ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రిటీల గురించి వారి జాతకాల గురించి మాట్లాడుతూ వార్తలలో నిలిచారు.
ఇకపోతే ఇటీవల కాలంలో ఈయన సినీ సెలబ్రిటీలు ఎవరైనా పెళ్లిళ్లు చేసుకుంటే వారి జాతకాలు చెబుతూ విడిపోతారని సంచలన వ్యాఖ్యలు చేశారు. రష్మిక విజయ్ దేవరకొండ పెళ్లి చేసుకున్న విడిపోతారని తెలిపారు అలాగే రకుల్ కూడా తన భర్త నుంచి విడాకులు తీసుకుంటుందని నయనతార కూడా విడాకులు తీసుకొని విడిపోతుంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే తాజాగా వేణు స్వామి చెప్పిన వ్యాఖ్యలు ఒక హీరోయిన్ విషయంలో నిజం కాబోతున్నాయని తెలుస్తోంది.
నయనతార విగ్నేష్ శివన్ దంపతుల గురించి గతంలో వేణు స్వామి మాట్లాడుతూ వీరిద్దరూ విడిపోతారని తెలిపారు. అయితే వీరిద్దరూ తమ వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉండటమే కాకుండా ఇద్దరు కవల మగ పిల్లలకు జన్మనిచ్చి తన భర్త పిల్లలతో నయనతార సంతోషంగా ఉంది కానీ ఇటీవల నయనతార సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేశారు.
ఒక మూర్ఖుడిని పెళ్లి చేసుకుంటే పెళ్లి ఎంత పెద్ద తప్పో తెలిసి వస్తుంది. అలాగే భర్త చేసిన పనికి భార్య బాధ్యత అస్సలు తీసుకోకూడదు.నన్ను ఒంటరిగా వదిలేయండి అంటూ ఒక పోస్ట్ పెట్టింది. అయితే ఈ పోస్ట్ నయనతార సోషల్ మీడియాలో వైరల్ అయిన కొద్ది క్షణాలకే మళ్ళీ డిలీట్ చేయడంతో నయనతారనే ఈ పోస్ట్ పెట్టి మళ్ళీ మీడియాలో ఈమె విడాకుల వార్తలపై అనుమానాలు వస్తాయి అనే ఉద్దేశంతో డిలీట్ చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా నయనతార చేసిన ఈ పోస్ట్ ఎన్నో సందేహాలకు కారణం అవుతుంది. ఇక ఈమె ఈ పోస్టు ద్వారా మరోసారి వేణు స్వామి వ్యాఖ్యలు కూడా ట్రెండ్ అవుతున్నాయి.