గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా బుచ్చిబాబు దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీ రూపొందుతున్న సంగతి అందరికీ తెలిసిందే. రామ్ చరణ్ కి ఇది 16వ సినిమా కాబట్టి ఆర్ సి 16 వర్కింగ్ టైటిల్ తో సినిమా షూటింగ్ జరుగుతుంది. ఈ సినిమాకి పెద్ది అని టైటిల్ ని పరిశీలిస్తున్నారు మూవీ టీం. అయితే ఈ సినిమాలో బాలీవుడ్ కండలు వీరుడు సల్మాన్ ఖాన్ ఒక కీలక పాత్ర చేస్తున్నారని సమాచారం.
అయితే ఈ విషయంపై చరణ్ అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. నిజానికి సల్మాన్ ఖాన్ కి మెగాస్టార్ కుటుంబానికి మంచి అనుబంధమే ఉంది. ఆ అనుబంధంతోనే చిరంజీవి హీరోగా నటించిన గాడ్ ఫాదర్ సినిమాలో సల్లు బాయ్ ఒక మంచి క్యారెక్టర్ చేశాడు. అయితే ఆ క్యారెక్టర్ ఆ సినిమాకి ఏమీ ఉపయోగపడలేదు సరి కదా వాళ్ళిద్దరూ కలిసి చేసిన పాట ఆ సినిమాకి పెద్ద మైనస్ అని అప్పట్లో టాక్ నడిచింది.
అలాగే కీసికా భాయ్ కీసికా జాన్ అనే సినిమాలో వెంకటేష్, సల్మాన్ ఖాన్ లతో కలిసి ఒక సాంగ్ చేశాడు మన చరణ్ . ఆ సినిమా కూడా చాలా దారుణంగా బాక్స్ ఆఫీస్ దగ్గర బాల్తా కొట్టింది. ఆ సినిమాలో ఆ పాట ఉంది అని తెలిసేలోపే సినిమా ధియేటర్ల నుంచి బయటికి వచ్చేసింది. ఈ పరిణామాలన్నీ దృష్టిలో పెట్టుకొని సల్లు భాయ్ చరణ్ సినిమాలో గనుక నటిస్తే సినిమా రిజల్ట్స్ ఎలా ఉంటాయో అని ఆందోళన చెందుతున్నారు చరణ్ అభిమానులు.
అయితే డైరెక్టర్ బుచ్చిబాబు సన్నిహితులు కొంతమంది ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ నటిస్తున్నాడు అనేది ఫేక్ న్యూస్ అని తేల్చి చెప్పేశారు. అయితే ఈ విషయంపై బుచ్చిబాబు ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు. ఇక ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ ఏరియాలో గల బూత్ బంగ్లాలో జరుగుతుంది. వారం రోజుల షూటింగ్ తర్వాత గేమ్ చేజర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కోసం చరణ్ అమెరికా వెళ్తున్నారు. సో కొద్దిరోజులు ఆర్సి 16 మూవీ వాయిదా పడుతుంది.