బాలయ్య షోకి నో చెప్పిన కింగ్ నాగార్జున.. అదే కారణమా?

బాలకృష్ణ వ్యాఖ్యాతగా ఆహా వేదికగా ప్రసారమవుతున్న అన్ స్టాపబుల్ కార్యక్రమం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఊహించని విధంగా ఈ కార్యక్రమానికి బాలయ్య వ్యాఖ్యాతగా వ్యవహరించడమే కాకుండా ఈ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతంగా ముందుకు నడిపించారు.ఇలా మొదటి సీజన్ ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకోవడంతో రెండవ సీజన్ కూడా ఎంతో ఘనంగా ప్రారంభం చేశారు. ఇక రెండవ సీజన్ మొదటి గెస్ట్ గా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు.

ఇక రెండవ ఎపిసోడ్ లో భాగంగా యంగ్ హీరోస్ సిద్దు జొన్నలగడ్డ, విశ్వక్ పాల్గొనబోతున్నట్లు ప్రోమో విడుదల చేశారు.ఇకపోతే ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ కూడా రానున్నారని పరోక్షంగా బాలకృష్ణ హింట్ కూడా ఇచ్చారు. ఇదిలా ఉండగా నాగార్జున సైతం అన్ స్టాపబుల్ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారంటూ వార్తలు వచ్చినప్పటికీ నాగార్జున ఈ కార్యక్రమానికి నో చెప్పారనే వార్తలు వినపడుతున్నాయి. అయితే నాగార్జున ఈ కార్యక్రమానికి దూరంగా ఉండడానికి ఓ కారణం ఉంది.

ఈ కార్యక్రమంలో భాగంగా బాలకృష్ణ వ్యక్తిగత విషయాలతో పాటు వృత్తిపరమైన విషయాలను కూడా ప్రశ్నిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే సమంత నాగచైతన్య విడాకుల ప్రస్తావన వస్తుందన్న ఉద్దేశంతోనే ఈ కార్యక్రమానికి నో చెప్పారని తెలుస్తోంది.ఈ విషయం గురించి నాగార్జున అన్ స్టాపబుల్ కార్యక్రమానికి హాజరు కాలేకపోతున్నారనేది సమాచారం. మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.